Advertisement
Google Ads BL

కాజల్ గురించి ఏదేదో అన్నారుగా..!!


సినిమాల్లో కాజల్ హవా ఎక్కడ తగ్గిందండి. నిన్నమొన్నటి వరకు కాజల్ కి సినిమా అవకాశాలు లేవన్న నోళ్లే.. ఇప్పుడు కాజల్ కి ఆఫర్స్ వెల్లువల్లా వచ్చి పడుతున్నాయంటున్నారు. నిజంగా గత ఏడాది ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి హిట్స్ చేతిలో ఉన్నప్పటికీ... కాజల్ కి ఓ అన్నంత అవకాశాలు రాలేదు. కానీ ఈ ఏడాది ద్వితీయార్ధానికి వచ్చేసరికి కాజల్ మళ్ళీ పుంజుకుంది. ఒక్కసారిగా మళ్లీ ఫామ్ లో కొచ్చేసింది. వెంకటేష్ సరసన చేస్తుంది అనుకుని... కాజల్ ఇక సీనియర్ హీరోస్ కే పరిమితం అన్న టైం లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వంలో ఒక మూవీ తో సెట్స్ మీదకెళ్ళిపోయింది ఈ చందమామ.

Advertisement
CJ Advs

అలాగే తమిళంలోనూ క్వీన్ రీమేక్ లో నటిస్తుంది. ఇంకా తాజాగా అర్జునరెడ్డి విజయ దేవరకొండ సరసన కాజల్ అనే న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో గట్టిగా వినబడుతుంది. విజయ దేవరకొండ సరసన కాజల్ అనగానే అబ్బా కాజల్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిందని అందరూ ఫిక్స్ అయ్యారు. అలాగే ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి డీసెంట్ చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నిర్మాత కెఎస్ రామారావు నిర్మాతగా తెరకెక్కే సినిమాలోనూ కాజల్ ని హీరోయిన్ గా తీసుకునే నిర్ణయం జరిగిందని టాక్. మరి ఇంతలా అవకాశాలు వరసబెట్టేస్తుంటే... కాజల్ ఇంకా మరో నాలుగేళ్లవరకు టాలీవుడ్ ని ఏలేయడం ఖాయం.

అయితే ఇక్కడ టాప్ లో ఉన్న హీరోయిన్స్ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంటే... కనుమరుగయ్యే హీరోయిన్ ఇలా రేస్ లో దూసుకుపోవడం మాత్రం అదుర్స్ అనిపించే రేంజ్ లో ఉంది. గత ఏడాది వరకు రకుల్ ప్రీత్ మంచి ఫామ్ లో హీరోయిన్స్ అందరికి చమట్లు పట్టించింది. కానీ ఈ ఏడాది వచ్చేసరికి అమ్మడుకి అవకాశాలు నిల్. ఇక కాజల్. గత ఏడాది అమ్మడు పనైపోయింది అనుకుంటే.. ఈ ఏడాది తెగ జోరు చూపిస్తుంది.  మరి లక్ష్మి కళ్యాణం, చందమామ సినిమాలప్పటి నుండి కాజల్ ఒకేలాంటి బాడీ షేప్ ని మెయింటింగ్ చేస్తూ ఇప్పటికి ఆ రేంజ్ అందాలతో అందరిని పడగొట్టేస్తుంది గనుకనే ఇలా బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయంటున్నారు. మరి కాజల్ కి అవకాశాలు లేవని రాసిన వాళ్ళే.. ఇప్పుడు కాజల్ అవకాశాలను చూసి నోరెళ్లబెడుతున్నారంటే నమ్మండి.

Kajal Agarwal Busy with Movies:

Heroine Kajal Agarwal in Vijay Devarakonda Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs