ఈమధ్య సీన్స్ డిమాండ్ చేసినా చేయకపోయినా కూడా సినిమాలలో హాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ దాకా లిప్‌లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అయితే అవి ఉన్నంత మాత్రానే సినిమాలు హిట్ అవుతాయని లేదు. ఆయా చిత్రాలలో నిజంగా ఈ సీన్స్ డిమాండ్ చేయడం, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలే బాగా ఆడుతున్నాయి. ఇక తెలుగుతో పోలిస్తే మలయాళ చిత్రాలలో ఇలాంటి సీన్లు ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నాయి. కానీ కొందరు మలయాళ ముద్దుగుమ్మలు మాత్రం వీటికి నో చెబుతున్నారు. కీర్తిసురేష్, 'ప్రేమమ్' బ్యూటీ సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు స్కిన్‌షోకి నో అంటున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి మరో 'ప్రేమమ్' బ్యూటీ కూడా చేరింది. ఆమే మడోన్నా సెబాస్టియన్. నేను లిప్‌లాక్ సీన్లను నో చెప్పడం వల్లే మూడు భారీ చిత్రాలలో అవకాశాలు పోయాయి. అయినా నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. తొలిసారిగా సినిమాలో కౌగిలింత సీన్ చేయాల్సివచ్చినప్పుడు ఏడ్చేశాను అంటూ.. తనకి బయటి వారితో మాట్లాడాలంటేనే భయమని చెప్పుకొచ్చింది. ఈమె ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా రూపొందుతున్న 'జుంగు'లో నటిస్తోంది. ఇది ఆమె విజయ్‌సేతుపతితో నటిస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. ఇందులో తన పాత్ర ఐదు నిమిషాలే అయినా సినిమాకి ఎంతో కీలకమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నానని అంటోంది.
ఇక తాను తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా నటిస్తున్నానని, కానీ భాషా సమస్య మాత్రం రాలేదని తెలిపింది. పురుషులతో స్త్రీలను సమానంగా గౌరవించే సమాజాన్ని తాను కోరుకుంటున్నానని, ప్రేమ అనేది వ్యక్తిగతం.. దానిని బయటికి చెప్పాల్సిన పనిలేదని చెబుతోన్న ఈ కేరళ కుట్టి తెలుగు 'ప్రేమమ్' రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.