Advertisement
Google Ads BL

అనుష్క చిత్రంలో నాని.. తెలుసా?


స్వీటీ అనుష్క 'బాహుబలి' చిత్రంలో దేవసేనగా నటించింది. ఈ చిత్రం సమయంలోనే ఆమె భాగమతికి కూడా ఓకే చెప్పింది. భాగమతి తర్వాత మాత్రం ఈమె మరో సినిమాని ఖరారు చేయలేదు. దాంతో ఆమె వివాహం చేసుకోనుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు ఆమె గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే చిత్రం ఒప్పుకుందని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి టాలెంట్‌ ప్రతి ఒక్కరికి తెలుసు. చేసింది కొన్ని చిత్రాలే అయినా క్రియేటివ్‌ జీనియస్‌గా ఆయనకు పేరు వచ్చింది. సినిమా జయాపజయాలను పక్కన పెడితే ఆయన తీసిన ప్రతి చిత్రం వైవిధ్యమే. ఒకే మూస చిత్రాలు చేయడం ఆయనకు నచ్చదు. 'ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా' వంటి చిత్రాలను తీశాడు. ఈయన తాజాగా గోపీచంద్‌ కోసం ఒక కథ తయారు చేసుకున్నాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే ఈ చిత్రం కత్తి మీద సాము అని భావించిన గోపీచంద్‌ ఇప్పటికే 'ఒక్కడున్నాడు, సాహసం' చిత్రాల తర్వాత మరో చిత్రాన్ని యేలేటితో చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట. తర్వాత ఈ కథ సాయిధరమ్‌తేజ్‌ వద్దకు, నితిన్‌ వద్దకు వెళ్లిందని అంటున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రంలో నటించేందుకు నేచురల్‌ స్టార్‌ నాని ఓకే చెప్పాడట. అయితే ఇదే క్రమంలో ఈ చిత్రంలో నాని హీరో కాదని, అది కేవలం సినిమాలో కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. 

ఇక ఇది లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ కావడంతో చంద్రశేఖర్‌ యేలేటి అనుష్కని కలిసి, స్టోరీ వినిపించి గ్రీన్‌సిగ్నల్‌ పొందాడని సమాచారం. ఈ చిత్రంలో కీలక పాత్రలకు మరో ఇద్దరు పేరున్న ఆర్టిస్టులను తీసుకున్నాడని కూడా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందని సమాచారం.

Hero Nani in Anushka Film:

Nani Key Role in Anushka and Chandra Sekhar Yeleti film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs