Advertisement
Google Ads BL

మాటల మాంత్రికుడి స్టైల్‌ అదే...!


సాధారణంగా సినిమాలు తీసే దర్శకులకు నటీనటుల అవుట్‌పుట్‌తో పాటు సాంకేతిక వర్గం వారి నుంచి తనకు కావాల్సినది రాబట్టుకోవడంతో ఒక్కోక్కరికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. దాసరికి కోపం వస్తే కుర్చీలు విసిరేసేవాడు. కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య వంటి వారు ఎంత కొత్తవారితో అయినా కూల్‌గా ఉండి అవుట్‌ పుట్‌ తీసుకుంటారు. తేజ, రవిరాజా పినిశెట్టి వంటి వారు నటీనటులను, ఇతర సాంకేతిక నిపుణులను తిట్టి, కొడతారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అంటే ఎంతో కూల్‌గా ఉంటూ సినిమా షూటింగ్‌ స్పాట్‌ ఓ విహారయాత్రలా ఎంతో సందడిగా ఉండేట్టు చూసుకుంటాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్‌పై ఎప్పుడు లేనన్ని  విమర్శలు వచ్చాయి. అసలు ఆ చిత్రానికి త్రివిక్రమ్‌ వర్క్‌ చేశాడా? లేదా ఆయన పేరు వేసుకుని ఘోస్ట్‌లు పనిచేశారా? అనేంతగా విమర్శల దాడి ఎదురైంది. అయినా త్రివిక్రమ్‌తోనే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మీద ఎంతో నమ్మకంతో తన హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో త్రివిక్రమ్‌తో తప్ప మరెవ్వరితో చిత్రం తీయనని చెప్పిన నిర్మాత చినబాబు అలియాస్‌ రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్‌పైనే నమ్మకం ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా గ్యాప్‌ లేకుండా సాగుతోంది. టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ వంటి వాటిని ఇప్పటికే ప్రకటించాడు. 'అరవింద సమేత వీరరాఘవ'గా వస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ కసితో తీస్తున్నా కూడా ఎంతో కూల్‌గా ఉంటున్నాడని తాజాగా తొలిసారి త్రివిక్రమ్‌తో పనిచేస్తున్న సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. 

ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ కూల్‌గా కూర్చుని ఉన్న ఫోటోని తమన్‌ పోస్ట్‌ చేయడమే కాదు.. ఈయన ట్వీట్‌ చేస్తూ మనతో పనిచేసే డైరెక్టర్‌ ఎంతో కూల్‌గా మనతో ఉంటే మంచి కూల్‌ట్రాక్స్‌ వస్తాయి. నాకు ఆయనతో ప్రతి రోజు కూల్‌గానే ఉంటుంది. పాటలు పూర్తి కావస్తున్నాయి అని చెప్పాడు. మరి ఈ చిత్రం ద్వారా త్రివిక్రమ్‌ మరలా తన పూర్వ వైభవం పొందుతాడో లేదో చూడాలి...!

SS Thaman Posts Trivikram's Latest Photo:

This is The Trivikram Style says SS Thaman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs