తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా నటించిన 'కెప్టెన్ ప్రభాకరన్' చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు మన్సూర్ అలీఖాన్. ఈయన ఆ తర్వాత చిరంజీవి 'ముఠామేస్త్రి', ఎన్టీఆర్ 'సాంబ' వంటి చిత్రాలలో నటించాడు. నిజానికి ఈయన చూపిన విలనిజానికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈయన వ్యక్తిగతంగా పలు ఆరోపణలు ఎదుర్కొని మూడు నాలుగు సార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. తన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూడటానికి ఓ లేడీ పీఏ కావాలని ప్రకటన ఇచ్చిన ఆయన స్నేహశర్మ అనే ఉద్యోగానికి వచ్చిన మహిళకు కూల్‌డ్రింక్‌లో డ్రగ్స్ కలిసి రేప్ చేశాడు. ఆమె గర్బవతి కావడంతో ఆమె తనని వివాహం చేసుకోవాలని ఆయనను కోరితే నిరాకరించాడు. చివరకు ఆమెకి 10లక్షల నష్టపరిహారం, మెయిన్‌టెనెన్స్ ఖర్చులు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది.
మరోసారి తన చిత్రం పైరసీగా విడుదలైందని, నడిరోడ్డుపై వాహనం నిలిపి ధర్నా చేసి ట్రాఫిక్‌ని ఇబ్బంది పెట్టడంతో అరెస్ట్ అయ్యాడు. ఇక ఆమధ్య ఓ పెద్ద భూకబ్జా కేసులో ఇరుక్కున్నాడు. రాజకీయ నాయకునిగా కూడా మారాడు. హీరోగా కూడా లీడ్‌రోల్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు మన్సూర్ అలీఖాన్ తుగ్లక్‌ని హీరోగా పరిచయం చేస్తూ తన స్వీయ దర్శకత్వంలో 'కడమాన్‌పారై' అనే చిత్రాన్ని తన సొంత బేనర్ అయిన రాజ్‌కెనడీ పతాకంపై నిర్మిస్తున్నాడు. నేటిరోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు, గురువుల మాట కూడా వినడం లేదు. ఇందులో భాగంగా ఓ ప్రేమజంట దట్టమైన అడవులకు వెళ్తుంది. అక్కడ సూరప్పన్ అనే ఆదివాసి నాయకుడుగా ఉంటాడు.
చివరకు ఫారెస్ట్ రేంజర్లు కూడా ఆయన చేతిలో పడితే ప్రాణాలతో బయటపడ్డారు. మరి ఈ ప్రేమజంట ఆ సూరప్పన్ అనే వ్యక్తి నుంచి తప్పించుకుందా? లేదా? అనేది సస్పెన్స్ అని ఇందులో సూరప్పన్‌గా తానే నటిస్తున్నానని మన్సూర్ అలీఖాన్ చెబుతున్నాడు. మొత్తానికి ఇదేదో వీరప్పన్‌ని చూసి స్ఫూర్తిగా తీసుకుని తీసిన చిత్రంగా అనిపిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.