Advertisement
Google Ads BL

రుజువు చూపిస్తా రండి.. నిర్మాత దానయ్య ఫైర్!


నిన్న ఆదివారం నుండి సోషల్ మీడియాలో నిర్మాత దానయ్య భరత్ అనే నేను సినిమా విషయంలో  కొరటాల శివకి, హీరోయిన్ కైరా అద్వానీకి రెమ్యునరేషన్ ఎగొట్టాడని.. కొరటాల శివ ఎన్నిసార్లు తన పారితోషకం గురించి అడిగిన నిర్మాత దానయ్య మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నాడనే న్యూస్ కేవలం సోషల్ మీడియానే కాదు... ఫిలింసర్కిల్స్ లోను హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత దానయ్య నిర్మాణంలో కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన భరత్ అనే నేను మంచి హిట్టే అయ్యింది. ఆ హిట్ కే మహేష్ బాబు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఐ ఫోన్స్ గిఫ్ట్ లుగా ఇచ్చాడు కూడా.

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం రోజులకే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేసిందని.. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మీడియాలో న్యూస్ రావడం కూడా జరిగింది. కానీ మాములు హిట్ అయిన సినిమాకి అంతగా లాభాల పంట పండడం అనేది అప్పటికే ఎవరికీ నమ్మబుద్ది కాలేదు. అయితే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో పోటీగా భరత్ అనే నేను సినిమా లెక్కలు చూపించడంపై అప్పట్లో కాస్త  హాట్ హాట్ చర్చలే జరిగాయి. అయితే తాజాగా నిర్మాత దానయ్య భరత్ అనే నేను కి పనిచేసిన కొరటాల, కైరా కి పారితోషకం పూర్తిగా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టాడనే న్యూస్ మాత్రం మీడియాలో, ఫిలింసర్కిల్స్ లో వైరల్ అయ్యింది. 

అయితే తనపై వస్తున్న వార్తలకు నిర్మాత దానయ్య స్పందించాడు. తనపై వస్తున్న ఈ వార్తలన్నీ నిరాధారమైనవని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అని.. భరత్ అనే నేను సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి తాను పూర్తిగా పారితోషకాలు చెల్లించానని... ఎవ్వరికి పారితోషకాన్ని పెండింగ్ లో పెట్టలేదని.. కావాలంటే రుజువు చేస్తానని... ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే.. హైదరాబాద్ లో ఉన్న తమ ఆఫీస్ కి వచ్చి చెక్ చేసుకోవచ్చని.... లేదంటే తమ సినిమాలో పని చేసిన నటీనటులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన ఘాటుగా స్పందించారు. అలాగే ఇలాంటి వార్తలు మీడియాలో స్ప్రెడ్ చెయ్యొద్దని ఆయన అందరిని కోరారు. కాగా నిర్మాత దానయ్య ప్రస్తుతం రామ్ చరణ్ - బోయపాటితో భారీ బడ్జెట్ చిత్రంతో పాటుగా... రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ని భారీ బడ్జెట్ తో అంటే 250 నుండి 300 కోట్లతో భారీగా నిర్మించనున్నాడు.

DVV Danayya Queashes Rumours on Him:

DVV Danayya Serious on BAN Gossip!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs