Advertisement
Google Ads BL

అందుకే పెళ్లి చేసుకున్నా: షారుఖ్‌!


ప్రముఖ ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ క్యూ అండ్‌ ఎ మెసేజింగ్‌ ఆప్షన్‌ రావడంతో సెలబ్రిటీలు అభిమానులతో తెగ చాటింగ్‌లు చేస్తున్నారు. ఈ ఆప్షన్‌ ద్వారా ట్విట్టర్‌లాగానే పలువురు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పే వీలు ఉంది. తాజాగా ఈ ఆప్షన్‌ని షారుఖ్‌ఖాన్‌ ప్రయత్నించాడు. సరదాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపధ్యంలో ఓ అభిమాని షారుఖ్‌ని ఓ వింతైన ప్రశ్న అడిగాడు. 

Advertisement
CJ Advs

ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్‌ అని అభిమాని అడగగా, షారుఖ్‌ సమాధానం ఇస్తూ, 'భాయ్‌.. ప్రేమ, అదృష్టం అనేవి ఎప్పుడు కలుగుతాయో చెప్పలేం. గౌరీ వల్ల నాకు ఆ రెండు ఒకేసారి దొరికాయి..' అని సమాధానం ఇచ్చాడు. ఆరేళ్లు ప్రేమించుకున్న తర్వాత 1991లో షారుఖ్‌, గౌరీలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్‌ ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో 'జీరో' చిత్రంలో మరగుజ్జుగా నటిస్తున్నాడు. 

ఎంతో కాలం తర్వాత ఇందులో షారుఖ్‌, సల్మాన్‌లు కలిసి కనిపించనున్నారు. వీరు చివరగా కొన్ని దశాబ్దాల కిందట 'కరణ్‌ అర్జున్‌' చిత్రంలో నటించారు. ఈ చిత్రం టీజర్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది. దీనికి తగ్గట్లుగా ఫ్యాన్‌మేడ్‌ టీజర్స్‌ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో అనుష్కశర్మ, కత్రినా కైఫ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. 

Shah Rukh Khan finally reveals why he got married Early:

SRK's answer on why he married so early proves that he is the 'King of Romance' in real life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs