తెలుగులో ఇద్దరు ఆదిలు ఉన్నారు. ఒకరు ఆది పినిశెట్టి కాగా.. రెండో వాడు ఆది సాయికుమార్. ఒకరు సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు ఆది పినిశెట్టి కాగా రెండోది డైలాగ్‌కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్. ఇక విషయానికి వస్తే తెలుగులో 'ఒక విచిత్రం'తో మొదలై 'సరైనోడు, రంగస్థలం' వరకు పలు చిత్రాలలో క్యారెక్టర్, సపోర్టింగ్ యాక్టర్‌గా నటించి ఆది పినిశెట్టి ఇకపై హీరోగానే నటించాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా కోనవెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాతగా కోనవెంకట్ కార్పొరేషన్, ఎంవివి సినిమా పతాకంపై 'నీవెవరో' చిత్రం రూపొందుతోంది. ఇందులో తాప్సి పన్ను, 'గురు' ఫేమ్ రితికాసింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఇటీవల కొరటాల శివ ఆవిష్కరించాడు.
తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ని చూస్తుంటే ఇదో థ్రిల్లర్, సస్పెన్స్ కధాంశాలతో రూపొందుతున్న చిత్రంగా అనిపిస్తోంది. మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు.. ఒక సంఘటన అంటూ ఈటీజర్ మొదలైంది. ఇది ప్రమాదం కాదు సార్.. ఇది ఓ హత్య అని ఓ యువతి పోలీసులకు చెబుతున్నట్లుగా ఈ టీజర్ ఉంది. 'ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో ఒక రూపంలో లభిస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి అంటూ ఆది పినిశెట్టి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇక టీజర్ చివరలో పోలీస్ వేషధారణలో ఉన్న వెన్నెల కిషోర్ 'మీరు స్కెచ్ వేసి చంపింది అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్. ట్రంప్ అయినా కిమ్ అయినా సరే లోపలేసి కుమ్ముతా' అంటూ ఉన్నాడు. ఇక హరనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ 'నీవెవరో' చిత్రం ద్వారా హరనాథ్ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.