రేణుదేశాయ్.. ఈ మాట వింటే ఒకప్పుడు మెగాభిమానులు వదినా అంటూ దేవతగా చూసేవారు. కానీ ఆమె రెండో వివాహం చేసుకోనున్న సందర్భంలో ఆమెపై వారు విమర్శల వర్షం కురిపిస్తూ, ట్రోలింగ్ చేస్తున్నారు. అయినా పవన్ రేణుదేశాయ్ నుంచి విడిపోయాక అన్నా లెజినోవాని వివాహం చేసుకుని పిల్లలను కూడా కన్నాడు. మరి అలాంటిది రేణు రెండో వివాహం చేసుకుంటే మెగాభిమానులకు వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్ధం కాని విషయం.
ఇక తాజాగా రేణుదేశాయ్ చాలా ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నా కూడా వాటిల్లో తన భర్త ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దానికి కారణం ఆమెని ఎవరైనా వివాహం చేసుకుంటామని ముందుకు వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతామని మెగాభిమానులు హెచ్చరించడమే.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రేణుదేశాయ్ తనకు కాబోయే భర్త, తన పిల్లలు అకిరా, ఆద్యలతో అమెరికా వెళ్లిందని సమాచారం. వ్యక్తిగత ట్రిప్‌గా ఆమె అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా పవన్-రేణుల కుమారుడు అకిరానందన్ తన తల్లి మొహం కనిపించేలా కాబోయే తండ్రి భుజం వైపు అటు తిరిగి ఉండగా ఫొటో తీశాడు. తన కాబోయే సవతి తండ్రి మొహం కనిపించకుండా అకిరా ఫొటోని ఎంతో నేర్పుతో తీశాడనే చెప్పాలి. మరి ఈమె ఎంత కాలం తనకు కాబోయే భర్తని దాచిపెడుతోందో చూడాలి...! బహుశా ఆమె వివాహ అనంతరం మాత్రమే ఆయనను అందరికీ పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.