Advertisement
Google Ads BL

దిల్ రాజు, ఇంద్రగంటి.. హీరోలు వీళ్లే..!!


దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు వరసబెట్టి మల్టీస్టారర్స్ తెరకెక్కుతున్నాయి. దిల్ రాజుకు సినిమాల మీద ఉన్న కమిట్మెంట్ తో ఆయన వరసబెట్టి మీడియం బడ్జెట్ లో ఇలా చక్కటి మల్టీస్టారర్ చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో ఎఫ్2 చిత్రాన్ని వెంకటేష్, వరుణ్ తేజ్‌ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న దిల్ రాజు.. సమ్మోహనంతో అందరిని సమ్మోహన పరిచిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మరో మల్టీస్టారర్‌ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాని కూడా మీడియం బడ్జెట్ లో అందరు మెచ్చేలా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తరహాలోనే ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నాడనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు అండ్ ఇంద్రగంటి మోహన కృష్ణలు హీరోలను సెలెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. గతంలో దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దాగుడు మూతలు కోసం హరీష్ అనుకున్న నితిన్ - శర్వానంద్ లో ఒకరైన శర్వానంద్ ఇప్పుడు దిల్ రాజు కోసం ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ మల్టీస్టారర్ లో నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. హరీష్ శంకర్ రాసుకున్న దాగుడు మూతలు కథకి హరీష్ తాజాగా పెద్ద హీరోలను, అలాగే మెగా హీరోలను అనుకోవడంతో నితిన్ అండ్ శర్వానంద్ లు ఈ మల్టీస్టారర్ నుండి డ్రాప్ అయినట్లుగా గతంలో వార్తలొచ్చాయి.

అయితే ఎలాగూ శర్వాతో పాటుగా హీరో నాని డేట్స్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు ఇంద్రగంటి  మల్టీస్టారర్ కోసం శర్వానంద్ అండ్ హీరో నానిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మరి నాని ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో బోలెడన్ని హిట్స్ కొట్టాడు. అందుకే దిల్ రాజు అడగ్గానే ఈ మల్టీస్టారర్ కోసం ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నాని ప్రస్తుతం నాగ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. శర్వానంద్ పడి పడి లేచే మనసుతో పాటుగా... సుధీర్  వర్మ మూవీలో నటిస్తున్నాడు.

Dil Raju and Mohankrishna Indraganti Movie Hero confirmed:

Dil Raju and Mohankrishna Indraganti Multistarrer movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs