Advertisement
Google Ads BL

మరో చిన్న సినిమా పెద్ద హిట్టు దిశగా..!


గత గురువారం విడుదలైన యూత్ఫుల్ ఎంటర్ టైనర్ RX 100 విడుదలైన ఫస్ట్ షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా మాత్రం యూత్ ని టార్గెట్ చేసి తియ్యడంతో.. ఈ సినిమా యూత్ కి బాగానే కనెక్ట్అయ్యింది. అయితే అది చాలా నెమ్మదిగా. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా నటించారు. ఈ సినిమాలో కార్తికేయ - పాయల్ ల జంట మధ్యన రొమాంటిక్ అండ్ లవ్ అండ్ కెమిస్ట్రీ అదుర్స్ అనే రేంజ్ లో సినిమా ఉంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా నచ్చక పోయినా యూత్ కి మెల్లగా కనెక్ట్ అవుతూ పోవడం వలనే సినిమాకి కలెక్షన్స్ ఈ రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి. ఇక సినిమాకి రామ్ చరణ్ అభినందనలు కూడా బాగా పనికొచ్చాయనే చెప్పాలి. రామ్ చరణ్ ని RX 100 చూడమని మూవీ యూనిట్ కోరగా.. ఖాళీ సమయంలో తప్పక చూస్తానని మాటిచ్చిన రామ్ చరణ్ ని స్వయంగా చిత్ర బృందం కలవగా... రామ్ చరణ్ ఈ సినిమా బాగా ఆడాలని కోరుకోవడంతో.. కాస్త మెగా ఫ్యాన్స్ కూడా RX 100 పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  అలాగే సినిమాపై యూత్ కి ఆసక్తిపెరిగేలా మూవీ యూనిట్ బాగానే ప్లాన్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అందుకే నెమ్మదిగా ఈ సినిమాలో ఉన్న రొమాంటిక్ ఫొటోస్ అంటే హీరో హీరోయిన్స్ హగ్ చేసుకున్న ఫొటోస్ దగ్గర నుండి... సినిమాలో కిస్ పెట్టుకున్న ఫొటోస్ వరకు.. అలాగే స్విమ్మింగ్ ఫూల్ లోని హాట్ హాట్ ఫొటోస్ ని మూవీ యూనిట్ విడుదల చేస్తూ సినిమాలో ఏదో ఉంది అన్నట్లుగా క్రియేట్ చేసి సినిమాని విజయం దిశగా చేరుకునేలా చేస్తుంది. మరి ఇలా కొత్తగా మూవీ ఫొటోస్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగానే ఆ హాట్ హాట్ ఫొటోస్ చూసిన ఎవ్వరైనా సినిమాకెళ్లి ఒక్కసారి చూడాలనే కోరిక కలుగుతుంది. మరి కుర్రకారు మాత్రం ఇలాంటి ఫొటోస్ చూస్తే ఎందుకాగుతారు. అందుకే మెల్లి మెల్లిగా RX 100 కి యూత్ బాగా కనెక్ట్ అవుతూ కలెక్షన్స్ ని ఈ రేంజ్ లో కొల్లగొట్టేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతలకైతే అన్నీ లాభాలే. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడి ని థియేట్రికల్ రైట్స్ ద్వారానే రాబట్టేసింది. సో ఇప్పుడొచ్చే కలెక్షన్స్ మొత్తం లాభాలే అన్నమాట.

Superb Collections to RX 100:

RX 100 got good Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs