Advertisement
Google Ads BL

ఆ హీరో ఈ హీరోయిన్ కి దేవుడట..!


తమిళంలో యంగ్‌స్టార్స్‌లో విజయ్‌సేతుపతి ఒకరు. ఆయన చిత్రం అంటే దానిలో ఏదో వైవిధ్యం ఉంటుంది. ఇక ఈయన 'పిజ్జా, పిజ్జా2, నేను రౌడీనే' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రస్తుతం ఆయన చిరంజీవి 'సైరా' చిత్రంలో తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రంగా ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. రజనీ-కార్తీక్‌ సుబ్బరాజు చిత్రంలో కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇక విజయ్‌ తాజాగా నటించిన చిత్రం 'జుంగా'. గోకుల్‌ దర్శకుడు. మడానా సెబాస్టియన్‌ హీరోయిన్‌. వీరిద్దరు కలిసి నటిస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ఇది. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. తాజాగా విజయ్‌సేతుపతి మాట్లాడుతూ, ఈ కథ అనుకున్నప్పుడు హీరోయిన్‌గా సెబాస్టియన్‌ అయితే బాగుంటుందని భావించాం. ఒక సారి కథ విని నచ్చితే చేయండి అన్నాను.

ఆమెకు నాపై చాలా నమ్మకం ఉంది. మేము ఆమె పారితోషికం గురించి మాట్లాడుతూంటే మీరు నాకు దేవుడు. ఇంత మొత్తం ఇవ్వండి అని నేను డిమాండ్‌ చేయను. మీరు ఎంతిచ్చినా ఫర్వాలేదు అని చెప్పిందట. నేను చూసిన హీరోయిన్లలో ఆమెకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వయసులో చిన్నదైనా ఉన్నతంగా ఆలోచిస్తారు. ప్రతి చిత్రానికి నటిగా ఆమె ఉన్నతస్థాయికి ఎదుగుతోందని విజయ్‌సేతుపతి.. సెబాస్టియన్‌కి కితాబునిచ్చాడు.

Vijay Sethupathi praises Madonna Sebastian on stage:

Madonna Sebastian does a cameo in Vijay Sethupathi's 'Junga'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs