బాలీవుడ్ కింగ్ ఖాంగ్ షారుఖ్‌ఖాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో 'జీరో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నఈ చిత్రం టీజర్‌ని ఇటీవల రంజాన్ సందర్భంగా విడుదల చేశారు. గతంలో కమల్‌హాసన్ 'విచిత్ర సోదరులు' చిత్రంలో నటించినట్లుగా షారుఖ్‌ఖాన్ కూడా ఇందులో మరగుజ్జు పాత్రను పోషిస్తున్నాడు. ఈ టీజర్‌లో షారుఖ్ అందరు తనని చూడాలని భావిస్తున్నట్లు అనుకుని స్టైల్‌గా ముందుకు రావడం, కానీ వెనుక సల్మాన్‌ఖాన్ ఎంట్రీ ఇవ్వడం వంటివి టీజర్‌కి మంచి రెస్పాన్స్ లభించేలా చేశాయి.
ఆ తర్వాత షారుఖ్, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయడం, షారుఖ్.. సల్మాన్ చంకనెక్కి ముద్దు పెట్టుకోవడం అనేవి అలరిస్తున్నాయి. ఈ టీజర్‌ని రాహుల్ అనే అభిమాని క్రాషింగ్ క్యూబ్స్ పేరిట యానిమేషన్ రూపంలో రూపొందించాడు. ఇందులో షారుఖ్, సల్మాన్‌ల యానిమేషన్ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌ని రాహుల్ షారుఖ్‌కి ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు షారుఖ్ ఫిదా అయిపోయాడు.
'ఈ టీజర్ ఎంత స్వీట్‌గా ఉంది. ధన్యవాదాలు' అని రాహుల్‌కి తెలిపాడు. ఇక ఈ చిత్రం కోసం అందరు వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరణ్ అర్జున్ చిత్రం తర్వాత షారుఖ్, సల్మాన్ కలిసి నటిస్తున్నచిత్రం ఇదే కావడం విశేషం. ఇక జీరో చిత్రంలో షారుఖ్ సరనన అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌లు కలిసి నటిస్తున్నారు.