దేశంలో సంప్రదాయ వాదులకు, మానవహక్కులు, స్వేచ్చ కావాలని కోరే వారికి ఎప్పుడు మాటల యుద్దం నడుస్తూనే ఉంటుంది. ఇక విషయానికి వస్తే మన దేశంలో ఆడవారిపై, పసి పిల్లలపై కూడా లైంగిక దాడులు, రేప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని అరికట్టాలంటే కొన్ని పాశ్చాత్యదేశాల వారి మాదిరిగా సెక్స్ వర్కర్లకు లైసెన్స్‌లు ఇచ్చి, వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని, సెక్స్ వర్కర్లకు నిత్యం ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తూ ఎయిడ్స్‌తో సహా ఇతర లైంగిక వ్యాధులను చెక్ చేసి లైసెన్స్‌లు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఎంతో కాలంగా వినిపిస్తోంది.
మరోవైపు ఇతర దేశాలలోలాగానే హోమో సెక్సువల్స్, లెస్బియనిజంకి కూడా అనుమతులను ఇస్తే ఈ చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు జరుగుతున్న లైంగికవేధింపులు కాస్తయినా అదుపులోకి వస్తాయని కొందరు మేధావులు చెబుతున్నారు. ఇక మనదేశంలో హోమో సెక్సువల్స్, లెస్బిజనిస్టులు లేరని చెప్పడం కూడా సరికాదు. సామాన్యుల నుంచి యువత, కాలేజీలు హాస్టళ్లలో ఉండే యువతీయువకులు చాలా మంది ఇదే పనిని గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. అంతేగాదు ఇది కేవలం సామాన్యులలోనే కాదు.. ఎంతో పేరున్నగొప్పగొప్పవారిలో కూడా ఈ పోకడ ఉంది.
ఇక దీనిపై తాజాగా బాలీవుడ్ నటి మహికాశర్మ ఈ విషయంలో సంచలన కామెంట్స్ చేసింది. సెక్షన్ 377ని రద్దు చేసి, స్వలింగ సంపర్కానికి ఆమోదం పలకాలని ఆమె కోరింది. ఇక వినోదరంగంలో ఉన్న పలువురు పురుషులు హోమో సెక్సువల్సేనని, బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, హీరోయన్లు కూడా స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడతారని వ్యాఖ్యానించింది. మన దేశంలో హత్యలు, అత్యాచారాలు చేసే వారికి స్వేచ్చ ఉంది కానీ హోమో సెక్స్‌వల్స్‌కి మాత్రం స్వేచ్చ లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె నిజంగా హోమో సెక్సువల్స్ ఎంతో మంచి వారు. వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వారికి స్వేచ్చ లభించేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. ఇక బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్, కరణ్‌జోహార్‌లతో పాటు టాలీవుడ్‌లో కూడా కొందరు హోమోసెక్స్‌వల్స్ ఉన్నట్లూ గతంలో పలు వార్తలు షికారు చేశాయి.