Advertisement
Google Ads BL

నిజంగా.. కౌశల్‌ తాకరాని చోట తాకాడా!


ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా భావోద్వేగాలతో, విమర్శలు, ప్రతి విమర్శలతో బిగ్‌బాస్‌ సీజన్‌2 సాగుతోంది. తాజాగా 'మంచి-చెడు' టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్స్‌ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, హౌస్‌లోని సామానులను ధ్వంసం చేస్తూ సంయమనం కోల్పోయారు. వ్యక్తిగత దూషణలలో మితిమీరారు. ఒకరిని ఒకరు అరుచుకుంటూ, గాయపరుచుకునే స్థాయి దాకా ఇది వెళ్లింది. ఇక కౌశల్‌ మీద భానుశ్రీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. మొదటి నుంచి కౌశల్‌ అంటే కొందరు కావాలని అతడిని టార్గెట్‌ చేస్తున్నారు. కానీ ఇది హద్దులు మీరడంతో వీక్షకుల్లో కౌశల్‌కే సింపతీ లభించి, అది ఆయనకే లబ్దిని చేకూరుస్తూ వస్తోంది.

Advertisement
CJ Advs

ఎవరి మాటలకో పరిమితం అయిన కౌశల్‌ మీద మాటల యుద్దం చేసి టార్గెట్‌ చేసిన దామరాజు కిరిటీ ఏకంగా షో నుంచే ఎలిమినేట్‌ అయ్యాడు. ఆ సంఘటనే కౌశల్‌ని ప్రేక్షకుల్లో హీరోని చేయగా, దామరాజు కిరిటీని విలన్‌ని చేసింది. కౌశల్‌కి ఎంతగా ప్రేక్షకుల వద్ద మద్దతు వచ్చిందంటే సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేసినంతగా సాగింది. ఆ సంఘటన తర్వాతే ప్రేక్షకుల్లో కౌశల్‌ వర్సెస్‌ తేజస్వి అనే చీలిక వచ్చింది. అయితే ప్రస్తుతం మరలా అదే తప్పును భాను చేస్తోంది. వాస్తవానికి హౌస్‌లో మొహమాటం లేకుండా మాట్లాడే వారిలో భానుని ముందుకు చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌ నాని కూడా ఒప్పుకున్నాడు.

కానీ తాజాగా భాను కౌశల్‌ తనని తాకరాని చోట తాకాడని తీవ్ర ఆరోపణలు చేసింది. మొదటి నుంచి కౌశల్‌ అంటే గిట్టని తేజస్విని దీనికి మద్దతు తెలుపుతూ 'వాడి బుద్దే అంత' అని అంది. కానీ అదే టీంలోని గీతామాధురి మాత్రం కౌశల్‌కి అండగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ, ఈ ఆరోపణలు నిజం కాదు.దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని కోరింది. దాంతో టెన్షన్‌ పడ్డ కౌశల్‌.. గీతామాధురి కామెంట్స్‌తో మరలా మామూలు మనిషి అయ్యాడు. మొత్తానికి అందరు కౌశల్‌నే టార్గెట్‌ చేస్తున్నవేళ కౌశల్‌కి అది ప్లస్‌ పాయింట్స్‌గానే ఉపయోగపడుతూ ఉండటం విశేషంగా చెప్పాలి.

Bhanu Sri Sensational Comments On Kaushal In Bigg Boss Telugu:

War Between Kaushal and Bhanu Sri In Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs