Advertisement
Google Ads BL

'సైరా'ని అడ్డుకుంటుందెవరో తెలుసా..?


గత ఏడాది డిసెంబర్ లో మొదలైన సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ లోని కోకాపేట పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్స్ లో శరవేగంగానే జరుగుతుంది. నిన్నమొన్నటివరకు షూటింగ్ ని సై రా టీమ్ పరిగెత్తించింది. అసలే మొన్నటివరకు షూటింగ్ మధ్యలో గ్యాప్ వలన ఏకంగా ఐదారు నెలల టైం వెస్ట్ అవడంతో.. ఇక షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకోవాలని మెగాస్టార్ చిరు కూడా భావించబట్టే.. సై రా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ వయసులోనూ రోజుకి 16 గంటల పైమాటే చిరంజీవి సైరా షూటింగ్ కోసం టైం కేటాయిస్తున్నాడట.

Advertisement
CJ Advs

ఇక చిరు ఉత్సాహం చూసి సైరా టీమ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదట. అయితే కోకాపేట లో వేసిన సెట్ లో సైరా మూవీ కి సంబందించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ కీలక సన్నివేశాల కోసం సైరా నిర్మాత రామ్ చరణ్ ఏకంగా 42 కోట్లు కేటాయించాడనే టాక్ కూడా ఉంది. మరి అంతగా ఖర్చు పెట్టి ఎంతో శ్రద్దగా సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నప్పుడు ప్రకృతి కోపగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఈ వర్షాల వలన సినిమా షూటింగ్ కి పదే పదే ఆటంకం ఏర్పడుతుందట. 

ఇక ఈ వర్షాల వలన షూటింగ్ ఆగిపోవడంతో.. ఆ షూటింగ్ లో పాల్గొంటున్న వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు వెనుదిరిగి పోతున్నారట. మరి ఇప్పటివరకు అనేక కారణాలతో సినిమా షూటింగ్ వాయిదా పడుతుంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వలన షూటింగ్ జాప్యం జరగడంతో... మూవీ యూనిట్ కాస్త టెంక్షన్ లో ఉందట. ఇక ప్రస్తుతం చిరంజీవి, కన్నడ నటుడు సుదీప్, ఇంకా కొన్ని మెయిన్ కేరెక్టర్స్ మీద ఆంగ్లేయులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, తమన్నా వంటి మేటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ అండ్ మూవీ టీమ్ ఏర్పాట్లను ఇప్పటికే మొదలు పెట్టేసారు.

Rain halts Sye Raa shoot:

Sources reveal nonstop rain forced the Sye Raa makers to stop the shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs