Advertisement
Google Ads BL

చినబాబుకు భలే ఛాన్సిచ్చారు..!


ఈ వారం బరిలో తెలుగు నుండి విజేత, RX 100 సినిమాలు గురువారం బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యగా... ఈ శుక్రవారం కోలీవుడ్ నుండి చినబాబుగా కార్తీ బరిలోకి దిగుతున్నాడు. అయితే నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX 100, విజేత మూవీస్ రెండు సో సో గా వున్నాయి. అసలు ప్రేక్షకులు వాటికీ ఏ టాక్ ఇచ్చారో అనేది సరైన క్లారిటీ లేదు. అలాగే క్రిటిక్స్ కూడా ఆ రెండు సినిమాలకు సరైన మార్కులే వెయ్యలేదు. మరి ఈ రకంగా రెండు సినిమాలు హుష్ కాకి అయినట్లే కనిపిస్తున్నాయి. RX 100 సినిమా యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కావడం.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేదిగా లేకపోవడం ఆ సినిమాకి అతి పెద్ద మైనస్. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజపుట్ గ్లామర్ తో రెచ్చిపోగా... హీరో కార్తికేయ కూడా యూత్ ని మెప్పించే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా కేవలం అంటే కేవలం యూత్ కే కనెక్ట్ అవుతుంది..అవ్వకపోవచ్చు అనే తీర్పు వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక మెగా ఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా విజేత కూడా సో సో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్  దేవ్ హీరోగా ఓకే పెరఫార్మెన్స్ చెయ్యగా.. ఈ సినిమాలో అందరి కన్నా ఎక్కువగా మురళీ శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో అదరగొట్టే నటనతో అందరి మనసులని దోచుకున్నాడు. అసలు ఈ సినిమాకి కళ్యాణ్ దేవ్ హీరో అనేకన్నా మురళీ శర్మని హీరో అనడం బెటరేమో. మురళీ శర్మ మధ్యతరగతి తండ్రిగా.... కొడుకు తిరిగే అల్లరి చిల్లరి పనులను భరిస్తూ అనారోగ్యం పాలయ్యే వ్యక్తిగా అదరగొట్టాడు. కుటుంబం కోసం సంతోషాలను, కెరీర్ ని పణంగా పెట్టే వ్యక్తిగా మురళీ శర్మ నటన అద్భుతంగా వుంది. అలాగే ఈ సినిమాలో తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా బాగా పండింది. ఇంకా మ్యూజిక్ పర్వాలేదనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటుగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంది. అయినా ఈ సినిమా కథ, కథం మరి రొటీన్ కావడంతో... సినిమాకి యావరేజ్ టాక్ నడుస్తోంది.

మరి ఈ రెండు సినిమాలతో పోటీగా ఈ రోజు కోలీవుడ్ హీరో కార్తీ.. తెలుగు తమిళంలో చినబాబుని విడుదల చేస్తున్నాడు. ఇక కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అండ్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇప్పుడు కార్తీకి ఎదురు లేదు. వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్న పెద్ద కుటుంబంలో చినబాబుగా కార్తీ వ్యవసాయదారునిగా కనిపించనున్న ఈ సినిమా టాక్ ఏమాత్రం లేచినా కార్తీ చినబాబుకి కలెక్షన్స్ అదిరిపోతాయ్. రైతు బ్యాగ్రౌండ్ తో వస్తుంది కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. చూద్దాం ఈ వారం రెండు సినిమాలు చేతులెత్తేయ్యగా.. మరో సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

Superb Chance to Karthi Chinnababu Movie:

Karthi Movie Chinababu Release After Vijetha and RX 100 release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs