Advertisement
Google Ads BL

హాలీవుడ్డోళ్లు దేన్నీ వదిలేలాలేరుగా..!!


తాజాగా థాయ్‌లాండ్‌కి చెందిన జూనియర్‌ ఫుట్‌బాల్‌ టీం అతి భయంకరమైన అడవులు, గుహలలోకి వెళ్లి ఆరునెలలు గడపాలని నిర్ణయించారు . కానీ అతి భయంకరమైన ప్రమాదకరమైన ఆ గుహలోకి ఉన్నట్లుండి వరదనీరు పీకల్లోతుకు రావడం, ఈ గుహలో దారులు మిస్టరీ కావడంతో ఈ జట్టు, వారి కోచ్‌ గుహలో ఇరుక్కుపోయారు. వీరిని రక్షించడం కోసం అమెరికాతో పాటు పలు దేశాలు సాయం ప్రకటించి డైవర్లను పంపాయి. ఇక ఇన్నిరోజులు ఆహారం లేక, ఆ బురద నీటినే తాగుతూ ఫుట్‌బాల్‌ టీం సభ్యులు క్షణమొక యుగంగా బతికారు. వీరికి కావాల్సినంత ధైర్యాన్ని వారి కోచ్‌ అందించాడు. నాటకీయ పరిణామాల మధ్య వారిని డైవర్లు కాపాడారు. ఈ క్రమంలో ఓ డైవర్‌ మృత్యువాత పడ్డారు. పిల్లలను రక్షించబోయి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు. 

Advertisement
CJ Advs

భయంకరమైన గుహ, చుట్టూ చిమ్మచీకటి, పీకల్లోతు వరదనీరు. గంటల కొద్ది గుహ నుంచి బయటకు రావాలని ప్రయాణం, భారీ వర్షాలు... ఇవ్వన్నీ వింటే మనకు నిజంగానే ఓ హాలీవుడ్‌ సాహస చిత్రం కళ్లముందు కదలాడుతుంది. దీంతో ఈ డేంజరస్‌ రెస్క్యూ ఆపరేషన్‌ని ఆంగ్ల చిత్రంగా హాలీవుడ్‌లో తీయాలని ఓ నిర్మాణ సంస్థ భావిస్తోంది. ప్యూర్‌ఫ్లిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ, కావోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఆడమ్‌ స్మిత్‌తో పాటు ఈ కథను చిత్రంగా తీయాలని భావిస్తున్నామని ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో మైఖేల్‌ స్కాట్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రకటించాడు. దీనికోసం 60 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు 400కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈ వాస్తవ కథ హక్కులను తాము సంపాదించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపిన ఆయన ఈ కథలో సాహసం, హీరోయిజం, ఎమోషన్స్‌ వంటివన్నీ ఉన్నాయని, ఇప్పటికే ఈ రెస్క్యూలో పాల్గొన్న 90మంది డైవర్స్‌తో మాట్లాడామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అశువులు బాసిన డైవర్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని అంకితమివ్వనున్నామని ఈయన తెలిపారు. 

Producers plan movie about Thai cave rescue:

The ethics of making a movie about the Thai cave rescue story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs