Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లోకి మరో మసాలా హీరోయిన్..!


టాలీవుడ్ లో కుమారి 21 ఎఫ్ తో బాగా పాపులర్ అయిన హెబ్బా పటేల్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. చేతిలో హిట్స్ లేక అల్లాడుతున్న హెబ్బా ప్రస్తుతం 24 కిస్సెస్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరసబెట్టి ప్లాప్స్ అవడంతో... ప్రస్తుతం కుమారి పరిస్థితి ఏమి బాగోలేదు. రాజ్ తరుణ్ తో జట్టు కట్టినప్పుడు కెరీర్ బాగానే ఉంది. కానీ వారి మధ్య ఏదో ఉందనే రూమర్స్ తో, అలాగే రాజ్ తరుణ్ కూడా ఒక పక్క ప్లాప్స్ లో ఉండడంతో వారు కలిసి మళ్ళీ నటించడం లేదు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ఇద్దరు ఒకేలాంటి దారిలో ప్రయాణం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో బుల్లితెర మీద మంచి ప్రాచుర్యం పొందిన... బిగ్ బాస్ హౌస్ లోకి కుమారి అంటే హెబ్బా పటేల్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ 2  సక్సెస్ ఫుల్ గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో మసాలా బాగా దట్టించి ప్రేక్షకులకు చేరువయ్యేలా స్టార్ మా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందులో శని ఆదివారాల్లో నాని యాంకరింగ్ చేసినప్పుడు బావున్న టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వీక్ డేస్ లోను పర్వాలేదనిపిస్తున్నాయి. ఎందుకంటే షో లో జరిగే టాస్క్ లు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక ఆ హౌస్ లోకి ఒక వారం లేట్ గా ఎంటర్ అయిన నందిని అక్కడ సెటిల్డ్ పెరఫార్మెన్స్ ఇస్తుంటే.. తేజస్వి మడివాడ హాట్ హాట్ గా రెచ్చిపోతుంది. ఇక సామ్రాట్, తేజస్విని మధ్యన ఏదో నడుస్తుందని ... అలాగే తనీష్, దీప్తి సునయన మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ బోలెడంత మసాలాను చూపిస్తున్న బిగ్ బాస్ లోకి ఇప్పుడు హెబ్బా కాలు పెట్టబోతుందనే న్యూస్ బాగా వినబడుతుంది. ఎందుకంటే హెబ్బా పటేల్ హాటెస్ట్ గ్లామర్ తో బిగ్ బాస్ ని ఒక ఊపు ఊపేస్తుందంటున్నారు. అందుకే మా యాజమాన్యం హెబ్బా పటేల్ ని వైల్డ్ కార్డు ఎంట్రీతో దింపే యోచనలో ఉన్నట్టుగా టాక్.

కానీ ఎంతగా ఫామ్ లో లేకపోయినా ఇలా బిగ్ బాస్ లోకి హీరోయిన్ స్టేటస్ ని బాగా ఎంజాయ్ చేసిన హెబ్బా పటేల్ అడుగు పెడుతుందా అంటే అనుమానమే. ఇక బాగా పాపులర్ అవ్వాలంటే నిజంగానే వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇవ్వొచ్చు అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. చూద్దాం హెబ్బా బిగ్ హౌస్ లోకి నిజంగానే ఎంట్రీ ఇస్తుందా.. లేదంటే ఇది రూమరా అనేది.

Hebah Patel To Enter Bigg Boss Show?:

Hebba Patel Wild Card Entry in Bigg Boss 2 Telugu?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs