Advertisement
Google Ads BL

అనుపమ ఇచ్చిన ఈ క్లారిటీ సరిపోతుందా?


ఎప్ప్పుడూ డీసెంట్ గా ట్రెడిషనల్ గా వుండే అనుపమ పరమేశ్వరన్ కి ఇప్పుడు కష్ట కాలం నడుస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తేజ్ ఐ లవ్ యూ ప్లాప్ అవడంతో పాటుగా.. రామ్ తో కలిసి జంటగా నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమే  చిత్ర షూటింగ్ సమయంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిట్టడంతో.. అనుపమ అప్ సెట్ అయ్యిందనే వార్తలతో అనుపమ అలెర్ట్ అవడమే కాదు వెంటనే ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగి మా మధ్యలో ఏం లేదని తనపైన వచ్చిన రూమర్స్ ని కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. అయితే వారి మధ్య గొడవ జరగడం నిజమని... సీన్ సరిగా పండించకపోవడంతో అనుపమ మీద ప్రకాష్ రాజ్ చిరాకు పడడంతో బిపి డౌన్ అయ్యి అనుపమ పడిపోవడంతో మూవీ యూనిట్ ఆఘమేఘాల మీద అనుపమని హాస్పిటల్ కి తరలించారనే వార్తలు మాత్రం ఆగలేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా అనుపమ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించింది. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూసి నాకు నవ్వొస్తుంది. అసలు నాకేమి కాలేదు. కొద్దిపాటి జ్వరము అండ్ బిపి తో బాధపడుతున్నాను. అయినా ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అసలు నేను హలో గురు షూటింగ్ స్పాట్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి చేసే సీన్స్ లో డైలాగ్స్ చెబుతున్నప్పుడు .. ఆ డైలాగ్ అండ్ సీన్ బాగా రాక తడబడ్డాను. దానికి ప్రకాష్ రాజ్ గారు వెంటనే మరోసారి డైలాగ్స్ చెప్పమని... అలాగే ఆ సీన్ మరో టేక్ చేద్దామని చెప్పారు. కానీ అప్పటికే నాకు కొద్దిగా ఫీవర్ ఉండడంతో... దానికి బిపి కూడా తోడై కొద్దిగా ఇబ్బంది పడడంతో... చిత్ర బృందం నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అయితే అక్కడి డాక్టర్స్ నన్ను పరీక్షించి మందులు రాసి కొద్దిపాటి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అంతే తప్ప నా ఆరోగ్యానికొచ్చిన ముప్పేం లేదని పిచ్చ క్లారిటీ ఇచ్చింది. మరి ఈ క్లారిటీ తో తనకి, ప్రకాష్ రాజ్ కి మధ్యన ఏం జరగలేదనే క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఒకే ఒక్క రూమర్ ని చెక్ పెట్టడానికి అనుపమ ఇంతగా కష్టపడాల్సి వచ్చింది. పాపం అనుపమ అంటున్నారు నెటిజెన్లు.

Anupama Gives Clarity on the sets of Hello Guru Prema Kosame:

Anupama Collapsed on the sets of Hello Guru Prema Kosame
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs