Advertisement
Google Ads BL

వాళ్ళు ముద్దులు పెట్టుకుంటుంటే.. గొడవంటారేంటి?


నిన్న బుధవారం సోషల్ మీడియాలో అఖిల్ 3 సినిమా షూటింగ్ లో ఏదో జరిగిందని.. ఆ ఏదో వలనే అఖిల్ షూటింగ్ కి రాకుండా ఎగ్గొట్టాడనే న్యూస్ మాములుగా స్ప్రెడ్ అవలేదు. డైరెక్టర్ వెంకీ అట్లూరితో అఖిల్ కి ఏవో విభేదాలు వచ్చాయని.. వామ్మో ఒకటేమిటి అనేక రకాల న్యూస్ లు వెలువడ్డాయి. అయితే ఒకే ఒక్క వెబ్సైటు అఖిల్ 3 సినిమా షూటింగ్ లో యేవో లుకలుకలు జరిగాయి అని రాయగా... మిగతావారు వాటిని మరికాస్త మసాలా దట్టించి మరీ ఆ న్యూస్ లు ప్రచురించారు. అఖిల్ 3 సినిమా షూటింగ్ స్పాట్ లో అఖిల్ స్క్రిప్టులో వేలు పెట్టాడని... తనకి మూడు సినిమాల అనుభవం వుంది... అందుకే వెంకీతో తాను చెప్పిన మార్పులు చేర్పు లు చెయ్యమని ఫోర్స్ చేసాడని.. కానీ దానికి వెంకీ అట్లూరి కుదరదని.. తాను రాసుకున్న స్క్రిప్ట్ నే ఫాలో అవుతూ... అఖిల్ చెప్పిన మార్పులు పెడ చెవిన పెట్టడంతో... అఖిల్ హార్ట్ అయ్యి షూటింగ్ కి ఎగ్గొట్టి మరీ తనకి ఒంట్లో బాగోలేదని సాకు చెప్పాడని ఇలా అఖిల్ 3 సినిమాపై ఒక రేంజ్ లో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Advertisement
CJ Advs

ఈ మధ్య రూమర్స్ కి ఒకే ఒక్క సెల్ఫీలతో చాలామంది స్టార్స్ తమపై వచ్చే రకరకాల రూమర్స్ కి చెక్ పెడుతున్నట్టుగా... తాజాగా అఖిల్ అండ్ వెంకీ అట్లూరిలు ఒక ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమపై వస్తున్న రూమర్స్ చెక్ పెట్టారు. అయితే అఖిల్ అండ్ వెంకీ అట్లూరిలు ఆ వీడియోలో తమ సినిమా షూటింగ్ విషయంలో వస్తున్న రూమర్స్ నిజమేనని.. ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ... నువ్వు ముందు మాట్లాడంటే.. నువ్వు మాట్లాడంటూ... కామెడీగా.... అఖిల్ నువ్వే మాట్లాడు.. నువ్వు డైరెక్టర్ వి అంటుంటే... మీరే మాట్లాడండి.. మీరు హీరోలు మీరు ముందు మాట్లాడండి అంటూ వెంకీ అనడంతో... అఖిల్ మాట్లాడుతూ.. వెంకీకి నాకు క్రియేటివ్ డిఫ్రెన్సెస్ ఉన్నాయట అనగా.. దానికి వెంకీ బాగా... అంటే మళ్ళీ అఖిల్ అయినా వెంకీ  డైరెక్టర్ కదా అందుకే ఆయనేది చెబితే అది చేస్తా అంటే.. ఛ అంటూ వెంకీ సెటైర్ వేస్తె.... దానికి అఖిల్ సో ఇది కరెక్ట్ న్యూస్ అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం అని చెబుతూ వెంకీ అట్లూరికి ఘాటుగా ముద్దు పెట్టేసాడు. ఇక అఖిల్, వెంకీ అట్లూరి లు పెద్దగా నవ్వేస్తూ ఉండగా... ఇంతలో బ్యాగ్రౌండ్ లో షాట్ రెడీ అంటూ ఒక గొంతు వినబడడంతో.. అఖిల్ 3 పై వచ్చిన రూమర్స్ అన్ని గాల్లో కలిసిపోయాయి.   

ఈమధ్యన పర్టిక్యులర్ గా గమనిస్తే కొన్ని సినిమాల విషయంలో ఇలా ఏదో ఒక న్యూస్ బయటికిరావడం... ఆ వెంటనే యూనిట్ సభ్యులు ఎలెర్ట్ అయ్యి అది నిజం కాదు కేవలం రూమర్ అంటూ ఏ సెల్ఫీ తోనో, ఏ వీడియో తోనో చెక్ పెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది.

Akhil and Director Venky Atluri Satirical Reaction on Gossips:

Akkineni Akhil and Venky Atluri Responds On Gossips 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs