Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అకౌంట్లో మరో బ్రాండ్..!


ఇప్పుడు ఏ భాషలోనైనా హీరోహీరోయిన్స్ కి సినిమాల్లో క్రేజ్ పెరగ్గానే వెంటనే వారికీ అనేక రకాల బ్రాండ్స్ కి సంబందించిన ప్రకటనలు వచ్చేస్తున్నాయి. వారు తమ ప్రొడక్ట్స్ ని ప్రకటిస్తే చాలు తమ ప్రొడక్ట్స్ అలా అలా జనాల్లోకి వెళ్ళిపోతాయని సదరు కంపెనీ యాజమాన్యం బాగా నమ్ముతుంటారు.  అందుకే స్టార్ హీరో హీరోయిన్స్ వెంట పలు కంపెనీ యజమానులు పడతారు తమ బ్రాండ్స్ ని ప్రమోట్ చెయ్యమని. అలా ప్రమోట్ చేసినందుకు గాను ఆయా స్టార్స్ కి బోలెడంత ముడుతుంది. మరి చాలామంది స్టార్స్ సినిమాల్లో సంపాదించేకన్నా.... ఎక్కువగా... ఈ యాడ్స్ రూపంలోనే ఎక్కువగా సంపాదించేస్తుంటారు. అందులో టాలీవుడ్ లో అయితే ఇలా యాడ్స్ రూపంలో సంపాదించే హీరోల్లో మహేష్ బాబు ముందుంటాడు.

Advertisement
CJ Advs

ఇక రామ్ చరణ్ కూడా ఈ మధ్యన మొబైల్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కోల్గెట్ యాడ్ తో పాటుగా రెడ్ బస్సు ఇలాంటి యాడ్స్ లో ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నవరత్న తైలం ఇలా కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయా ప్రోడక్ట్స్ యాడ్స్ లో నటించి డబ్బు సంపాదిస్తున్నాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ కోసం ఒక యాడ్ చేశాడు ఎన్టీఆర్. ఇక తాజాగా ఎన్టీఆర్ సెలెక్ట్ అనే మొబైల్ ఛైన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. ఈ సెలెక్ట్ మొబైల్ బ్రాండ్ ని ఒక సంవత్సరం పాటు ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్ ఆ మొబైల్ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.

ఇక ఎన్టీఆర్ ఆ సెలెక్ట్ మొబైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు గాను భారీ పారితోషకం అందుకుంటున్నాడని వినికిడి. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ముగ్గురు స్టార్ హీరోస్ అయిన అల్లు ఆర్జున్ లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వుంటే... రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా సెలెక్ట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. మరి ఇటు సినిమాలతో అటు కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్టీఆర్ ఇలా రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడన్నమాట. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత షూటింగ్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా వున్నాడు. ఇక ఈ సెలెక్ట్ మొబైల్ యాడ్ షూట్ లో ఎన్టీఆర్ ఎప్పుడు పాల్గొంటాడో తెలియాల్సి ఉంది.

NTR to Endorse Celekt Mobile Store:

Bunny Lot, Charan Happi, NTR?    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs