Advertisement
Google Ads BL

ప్రస్తుతం ఈ విలన్ టైమ్ నడుస్తోంది..!


రైజింగ్ విలన్ గా దూసుకుపోతోన్న శతృ

Advertisement
CJ Advs

తెలుగు నటుడు శతృ కోలీవుడ్ లో బిజీ అవుతున్నాడు. అదీ మెయిన్ విలన్ గా. ఆకట్టుకునే రూపంతో పాటు కండలు తిరిగిన దేహంతో ఏ పాత్రైనా చేయగలడు అనిపించేలా కనిపించే నటుడు శతృ. కృష్ణగాడి వీర ప్రేమగాథలో హీరోయిన్ అన్నయ్యగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు శతృ. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెప్పించాడు. పాత్ర ఎంత చిన్నదైనా తనదైన ముద్ర వేయగల ప్రతిభావంతమైన నటన చూపించడం శతృ శైలి. అందుకే చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అందరు హీరోల సినిమాల్లోనూ అలరించే పాత్రలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శతృకు తమిళ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదీ మెయిన్ విలన్ గా.

తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన చినబాబులో మెయిన్ విలన్ శతృనే. ఈ 13న విడుదల కాబోతోన్న చినబాబు సినిమాతో విలన్ గా తనకు కొత్త టర్న్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో అతని పాత్రకు విడుదలకు ముందే కోలీవుడ్ నుంచి అద్బుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం రైజింగ్ విలన్ గా పేరు తెచ్చుకున్న శతృ ఈ సినిమా తర్వాత స్టార్ విలన్ గా మారే అవకాశాలు ఉన్నాయని చాలామంది పెద్ద నటులు కూడా చెబుతున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చినబాబులో కార్తీతో సమానమైన ప్రాధాన్యం ఉన్న శతృది అంటున్నారు. అంటే సినిమా సక్సెస్ లో ఈ విలన్ దీ మెయిన్ రోల్ కాబోతోందనుకోవచ్చు. 

తెలుగులో ఇప్పటి వరకూ మంచి పాత్రలే చేశాడు శతృ. కానీ ఖచ్చితమైన బ్రేక్ మాత్రం రాలేదింకా. చినబాబు తన కెరీర్ కు ఒకేసారి రెండు భాషల్లో బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా శతృ అటు కోలీవుడ్ తో పాటు ఇటు తెలుగులోనూ బిజీ అవుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగులో ప్రతిభావంతమైన విలన్ పాత్రలు కరవవుతోన్న టైమ్ లో రైజింగ్ విలన్ గా శతృ దూసుకుపోతున్నాడు.

Shatru Waiting For Chinababu Result:

Shatru The Trending Villain
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs