Advertisement
Google Ads BL

'ఎఫ్‌2' భామలు హీరోలతో భలే సెట్టయ్యారు!


తెలుగులో ఈ మద్యకాలంలో మల్టీస్టారర్స్‌కి శ్రీకారం చుట్టిన సీనియర్‌ స్టార్‌గా వెంకటేష్‌ పేరును ముందుగా చెప్పుకోవాలి. నాగార్జున కూడా కార్తితో 'ఊపిరి', ప్రస్తుతం నానితో 'దేవదాసు' చేస్తున్నా కూడా ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మాత్రం విక్టరీ వెంకటేషే. ఆయన మహేష్‌బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామ్‌తో మసాలా, పవన్‌కళ్యాణ్‌తో గోపాల..గోపాల' వంటి చిత్రాలలో నటించాడు. ఇక వెంకటేష్‌ విషయానికి వస్తే ఈయన చివరగా నటించిన చిత్రం 'గురు'. ఎప్పుడు పెద్దగా గ్యాప్‌ తీసుకోని వెంకీ ఈమద్య మాత్రం ఏవైనా కారణాల వల్లనో లేక సరైన కథలు దొరకకనో కాస్త నెమ్మదించాడు. ఈ మద్యలో ఆయన కిషోర్‌ తిరుమలతో 'ఆడాళ్లు మీకుజోహార్లు', తేజ దర్శకత్వంలో ఓ చిత్రం, పూరీ జగన్నాథ్‌ అంటూ ఎన్నో చిత్రాల ద్వారా వార్తల్లో నిలిచినా ఆయన మాత్రం చివరకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి దిల్‌రాజుకి చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌కే ఓకే చెప్పాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రానికి 'పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌' వంటి సాదారణ కథలను కూడా తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసి మెప్పించిన అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న వారి స్టిల్‌ ఒకటి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో వెంకటేష్‌ పక్కన తమన్న, వరుణ్‌తేజ్‌ సరసన మెహ్రీన్‌లు కూర్చుని ఉన్నారు. ఈ చిత్రంలో కూడా వారిద్దరే వెంకీ, వరుణ్‌తేజ్‌ల సరసన నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆల్‌రెడీ 'ఎఫ్‌2' అనే టైటిల్‌ని దానికి ఉపశీర్షికగా 'ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌'ని ఖరారు చేశారు. మరి ఇందులో ఫన్‌ ఎవరు సృష్టింంచనున్నారు? ఎవరు ఫస్ట్రేషన్‌ చేయనున్నారు? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి ఇది కూడా ఓ పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని మాత్రం తెలుస్తోంది. 

ఇక వెంకీ, వరుణ్‌తేజ్‌లు ఇందులో తోడల్లుళ్లుగా కనిపించనున్నారట. ఇప్పటికే షూటింగ్‌లో వెంకీ జాయిన్‌ అయ్యాడు. తొలిరోజు షూటింగ్‌లో ఆయన లుంగీతో కనిపించిన ఫోటో కూడా బయటకు వచ్చి వైరల్‌ అవుతోంది. ఇక వెంకీ ఈ చిత్రంతో పాటు నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్‌ చేస్తుండగా, వరుణ్‌తేజ్‌ 'అంతరిక్షం' చిత్రాన్ని 'ఘాజీ' సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. 

F2 Shooting Starts and Two Heroines Joined with Heroes :

Tamanna and Mehreen Joins with Venky and Varun Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs