Advertisement
Google Ads BL

వీరిలో అసలైన విజేత ఎవరవుతారో..?


గత గురు, శుక్ర వారాల్లో విడుదలైన హీరోల సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుని థియేటర్స్ లో రన్ అవుతున్నాయి. గురువారం పంతంతో గోపీచంద్ రాగా.. శుక్రవారం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు అంటూ దిగాడు. ఇక రెండు సినిమాలు టాక్ సో సో గా ఉండటంతో ప్రేక్షకులు కూడా డీలా పడ్డారు. అయితే గతవారం చప్పగా వున్న టాలీవుడ్ బాక్సాఫీసు ఈ వారం కళకళలాడేలాగే కనబడుతుంది. ఎందుకంటే ఈ గురువారం మెగా హీరో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర అరంగేట్ర మూవీ విజేత సినిమాతో రాబోతున్నాడు. మెగా ఫాన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. లేకపోతే కళ్యాణ్ దేవ్ మొదటిసారి వెండితెర మీద ఎలా నటిస్తాడో అనేది ఇక్కడ ఆసక్తితో కూడుకున్న అంశం. 

Advertisement
CJ Advs

ఇక ఈ గురువారమే మరో కొత్త హీరో RX 100 సినిమాతో అందరిలో ఆసక్తి రేపుతున్నాడు. ఈ సినిమాని హీరో విజయ్ దేవరకొండ చెయ్యాల్సింది.. అతనికున్న డేట్స్ ప్రాబ్లెమ్ వలన ఆ సినిమా ఆ కొత్త హీరోకి వెళ్లిందని ప్రచారం ఉంది. మరి విజయ్ వదులుకున్న ఆ సినిమా ఎలా ఉండబోతుంది.. అందులోను ఆ RX 100 సినిమా ట్రైలర్స్ లోను, పోస్టర్స్ లోను యూత్ ని మెప్పించే అంశాలు ఎక్కువగా కనబడడంతో... ఈ సినిమాపై అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి లా వుంటుంది అనే టాక్ కూడా ఉంది. ఇక శుక్రవారం మాత్రం కోలీవుడ్ హీరో కార్తీ తన సినిమా చినబాబుతో తెలుగులో కూడా దిగబోతున్నాడు.

మరి కార్తీ సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. కార్తీ నటించిన ఊపిరి, ఖాకి సినిమాలు ఇక్కడ మంచి హిట్ అయిన సినిమాలే. అందుకే కార్తీ సినిమా చినబాబు పై మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా పల్లెటూరి నేపథ్యంలో రైతు సంక్షేమం కోసమా ఆలోచించే రైతు గా కార్తీ ఈ సినిమా టీజర్ అండ్ పోస్టర్స్  కనిపిస్తున్నాడు. మరి ఈ వారం ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చెప్పడం మాత్రం కొంచెం కష్టమైన పనే. చూద్దాం ఏ హీరో విజేతగా నిలుస్తాడా అనేది మరో రెండు రోజుల్లోనే తేలిపోతుంది.

Vijetha vs RX 100 vs Chinababu :

Who is The Winner in These Heroes?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs