Advertisement
Google Ads BL

'సాక్ష్యం'కు షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!!


బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో మూడు సినిమాలు చేయగా ఆ మూడు సినిమాలు భారీగా తెరకెక్కించిన చిత్రాలే. అందులో రెండు సినిమాలు అయితే ఏకంగా 30 కోట్ల పైమాటే. హిట్స్.. ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనపై భారీ లెవెల్ లో ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీయడం విషయంలో మేకర్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. తాజాగా శ్రీనివాస్ నటించిన 'సాక్ష్యం' సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది.

Advertisement
CJ Advs

ఈ సినిమా ఏకంగా 40 కోట్లు బిజినెస్ చేసిందని టాక్. ట్రేడ్ లెక్కలు ప్రకారం.. నైజాంకు 7 కోట్లు.. సీడెడ్ కు 5 కోట్లు..ఆంధ్ర మొత్తం కలిపి 15 కోట్లకు అభిషేక్ సంస్థ అమ్మేసిందనే వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ ప్లస్ డిజిటల్ మీద ఇప్పటికే 10 కోట్ల వరకు వచ్చాయంట. ఓ ఫాంటసీ కథ ఇంతలా బిజినెస్ జరగడం.. మరియు శ్రీనివాస్ పై ఇంత పెట్టడం అంటే మాములు విషయం కాదు.

పూజా హెగ్డే గ్లామర్, గ్రాఫిక్ సన్నివేశాలు, సినిమా టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు వున్నాయి. 'సాక్ష్యం' హిట్ అందుకోవాలంటే...కేవలం షేర్ మాత్రమే 30 కోట్లు అయినా రావాలి. ఓపెనింగ్స్ బాగా వస్తేనే కానీ అంత షేర్ కలెక్ట్ చేయలేదు ఈ సినిమా. దానికి తోడు మొదటి రోజు వచ్చే టాక్ ని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ వుంది.

Sakshyam Movie Pre Release Business Details:

Shocking Pre Release Business To Saakshyam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs