Advertisement
Google Ads BL

ద‌స‌రా బరిలోకి ఈ సినిమా కూడా..!!


ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న 'హ‌లో గురూ  ప్రేమ‌కోస‌మే'

Advertisement
CJ Advs

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌లో గురూ ప్రేమ కోస‌మే'. వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న మ‌రో సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  'సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్' చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కొంత టాకీ పార్ట్.. పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి  సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు, ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు. 

Hello Guru Prema Kosame Movie Release Date Fix:

<h1><span style="font-weight: normal;">Hello Guru Prema Kosame Movie Movie Release on October 18</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs