Advertisement
Google Ads BL

ఈ కమెడియన్ ఎంత బిజీ అంటే..?


నేడు బ్రహ్మానందంకి అవకాశాలు తగ్గిపోవడం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌, మల్లికార్జునరావు, కొండవలన, ఎమ్మెస్‌నారాయణ వంటి వారు మరణించడం వల్ల తెలుగు కామెడీలో కమెడియన్ల లోటు ఏర్పడింది. కానీ జబర్ధస్త్‌ ద్వారా పలువురు బుల్లితెర నుంచి వెండితెర మీదకు వచ్చిరాణిస్తున్నారు. సప్తపది, షకలకశంకర్‌, జబర్ధస్త్‌ మహేష్‌లతో పాటు ప్రియదర్శి వంటి వారు కూడా బాగానే అవకాశాలు సంపాదిస్తున్నారు. ఇక వేణుమాధవ్‌, అలీ వంటి వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ అవకాశాన్ని ఇద్దరు కమెడియన్లు బాగా అందిపుచ్చుకున్నారు. సునీల్‌ హీరోగా మారడం, సప్తగిరి, షకలకశంకర్‌లు కూడా అదే దారిలో ఉండటంతో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌లకు బిజీ పెరిగింది. వెన్నెల కిషోర్‌ కూడా హీరోగా, డైరెక్టర్‌గా ప్రయోగాలు చేసినా ఆ తర్వాత మాత్రం హీరో స్నేహితుని పాత్రలతోనే బాగా బిజీగా ఉన్నాడు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన పోస్ట్‌ చేసిన ఫొటోని చూసి పలువురు 'అబ్బ..వెన్నెల కిషోర్‌ ఇంత బిజీనా?' అని ఆరా తీస్తున్నారు. కారణం ఏమిటంటే ఆయన కారులో వెళ్తూనే ఒక చేత్తో గడ్డం ట్రిమ్మింగ్‌ చేసుకుంటూ ఉన్నాడు. అనుకున్న సమయం కన్నా షూటింగ్‌ పావుగంట ముందుగా ప్రారంభం కావడంతో తనకు ట్రిమ్మింగ్‌ చేసుకునే సమయం దొరకలేదని, మేకప్‌కి కూడా సమయం లేకపోవడంతో ఇలా చేశానని ఆయన తెలిపాడు. 

ఇప్పుడు మరలా సునీల్‌ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తూ ఇదే చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'లో నటిస్తున్నాడు. మరి వెన్నెల కిషోర్‌ బిజీకి సునీల్‌ ఏమైనా చెక్‌ పెడతాడేమో వేచిచూడాల్సివుంది...! 

Vennela Kishore Trim his Mustache in Car video goes viral:

Vennela Kishore Busy Busy with Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs