Advertisement
Google Ads BL

కత్తిపై హైపర్‌ ఆది కౌంటర్లే కౌంటర్లు..!


జబర్ధస్త్‌ షో నేడు అంతలా సక్సెస్‌ అవుతూ రన్‌ అవుతోందంటే హైపర్‌ ఆది విసిరే పంచ్‌లు, అనసూయ, రేష్మి వంటి వారి గ్లామర్‌ వంటివి కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ఇక హైపర్‌ ఆది పంచ్‌లు విసరడంలో ఘనాపాటి. ఈయనకు పవన్‌కళ్యాణ్‌ విషయంలోనే కత్తిమహేష్‌తో మాటల యుద్దం జరిగింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా హైపర్‌ ఆది మాట్లాడుతూ, కొన్ని కోట్ల మంది కొలిచే భగవంతుడు శ్రీరాముడిని కూడా తెచ్చి కత్తిమహేష్‌ న్యూస్‌ చానెళ్లలో కూర్చోబెట్టేశాడు. అసలు రాముడిని ఇలా అనడానికి కత్తిమహేష్‌కి మాటలెలా వచ్చాయి.. కత్తిమహేష్‌ సినిమాల మీదనే కాదు.. మనుషుల మీద, దేవుడి మీద కూడా రివ్యూలు రాస్తున్నాడు. నాకు కూడా ముస్లిం, క్రిస్టియన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారి పండుగలప్పుడు వారి ఇళ్లకు వెళ్లి నేను భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వారు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఇలా ఐకమత్యంగా ఉండే భారతదేశంలో కొందరు మతచిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం కత్తిమహేష్‌ వంటి వారు దేవుళ్లను కూడా బజారు కీడుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఇక హైపర్‌ ఆది గతంలో చెప్పినట్లు పైన బట్ట తల, ముందు పొట్ట అనే సెటైర్‌ని ఇప్పుడు నిజంగానే అందరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నిజంగా ఏ మతానికి చెందిన దేవుళ్లు, ఇతరుల విశ్వాసాలను గాయపరిచే వారు కమల్‌హాసన్‌ అయినా కత్తిమహేష్‌ అయినా, బాబుగోగినేని, కంచెఐలయ్య వంటి వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇక తాజాగా మాధవీలత కూడా కత్తిమహేష్‌ వ్యాఖ్యలను విని, నేనే అక్కడ ఉండి ఉంటే చెప్పు తీసుకుని కొట్టేదానిని అని ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Hyper Aadhi Fires on Kathi Mahesh:

Hyper Aadhi Counters on Kathi Mahesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs