Advertisement
Google Ads BL

రేష్మి అంతకు మించి మెప్పిస్తుందా..?


బుల్లితెర హాట్‌ యాంకర్స్‌లో అనసూయ, రేష్మి, శ్రీముఖిలను ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరు బుల్లితెర మీదనే కాదు.. వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోవైపు రేష్మి కూడా 'గుంటూరు టాకీస్‌, నెక్ట్స్‌ నువ్వే' వంటి చిత్రాలతో బాగానే గ్లామర్‌ని వెండితెరపై ఆరబోసింది. అయినా ఆమెకి అనసూయకి వస్తున్న విధంగా చాన్స్‌లు ఏమీ ఎక్కువగా ఉండటం లేదు. 

Advertisement
CJ Advs

ఇక చాలా కాలానికి రేష్మి, హీరో జైతో కలిసి 'అంతకు మించి' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. హర్రర్‌, థ్రిల్లర్‌, రొమాంటిక్‌ చిత్రంగా రూపొందుతున్న ఇందులో రేష్మి అందాల ప్రదర్శన 'గుంటూరు టాకీస్‌' తర్వాత ఆ రేంజ్‌లో ఉండనుందని అంటున్నారు. జానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ని క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ 'దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్‌ చేస్తే ఐదు కోట్లు ఇస్తారటగా' అనే డైలాగ్‌తో మొదలైంది. ఆ తర్వాత హీరోని ఉద్దేశించి 'వీడికి రాత్రంతా దెయ్యాల డ్యూటీ.. పగలంతా అమ్మాయిల డ్యూటీ' అనే సంభాషణ బాగానే ఆకట్టుకుంటోంది. 

ఇక ఈ చిత్రానికి కేవలం రేష్మినే ముఖ్యాకర్షణ అని చెప్పాలి. అంతకు మించి దర్శకుడు, నిర్మాతలు, హీరో, ఇతర నటీనటులు ఎవరిపై అంచనాలు లేవు. మరి ఈ చిత్రాన్ని కూడా రేష్మి 'గుంటూరు టాకీస్‌' తరహాలో ఒంటి చేత్తో విజయ తీరాలను చేరుస్తుందా? లేదా? అనేది కొద్ది కాలంలోనే తేలిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. 

Click Here For Trailer

Rashmi Gautham Anthakuminchi Trailer Released:

Anthakuminchi Trailer review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs