Advertisement
Google Ads BL

జగపతి బాబు కంటే నీచుడు ఉండడేమో..?


టాలీవుడ్ లో క్లాస్ హీరోగా ఎదిగిన జగపతి బాబుకి బిగ్ గ్యాప్ రావడంతో... సినిమాల నుండి సైలెంట్ గా తప్పుకున్నాడు. కానీ బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం లెజెండ్ సినిమాలో జగపతి బాబుని విలన్ గా తీసుకున్నాడు. మరి ఆ సినిమాలో జగపతి బాబు విలన్ గా ఎలా ఉంటాడో.. ఎప్పుడూ క్లాస్ గా కనబడే జగపతి బాబు విలన్ గా ఎలా నెగ్గుతాడని అనుకున్నారు. కానీ జగపతి బాబు విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. బోయపాటి జగపతి బాబు లోని విలన్ ని బయటికి తీసుకొచ్చాడు. ఇక అప్పటి నుండి టాలీవుడ్ లో టాప్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా జగపతి బాబు పేరు మార్మోగిపోయింది. 

Advertisement
CJ Advs

తర్వాత నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కి అపోజిట్ గా జగపతి బాబు చేసిన క్లాస్ విలన్ యాక్టింగ్ కి అందరూ పడిపోయారు. అలాగే బోయపాటి మళ్ళీ జయ జానకి నాయక సినిమాలో మరోసారి విలన్ పాత్ర ఇచ్చాడు. ఆ సినిమాలో పరువు కోసం కన్న కూతుర్నే చంపుకునే వాడిగా జగపతి బాబు అదరగొట్టేశాడు. ఇక సుకుమార్ రంగస్థలం లో జగపతి బాబు ప్రెసిండెంట్ ఫణింద్ర భూపతిగా అతి క్రూరమయిన మనసున్న సైలెంట్ విలన్ గా ఇరగదీశాడు. అయితే తాజాగా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ విలన్ గా జగపతి బాబు సాక్ష్యం సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దమై ప్రమోషన్స్ లో బిజీగా వుంది. 

సాక్ష్యం ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు ఆ సినిమా గురించి మట్లాడుతూ.. ఇంతవరకు, లెజెండ్, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక సినిమాల్లో విలన్ గా చేసిన నేను అంతకు మించిన విలన్ పాత్రలో సాక్ష్యం సినిమాలో చేశానని.... సాక్ష్యం సినిమాలో నా పాత్రని చూసిన ఎవ్వరైనా.. ఇంతకన్నా నీచుడు ఉండడేమో అనే అభిప్రాయానికి వస్తారని.. అలాంటి దారుణమైన విలన్ పాత్రలో నేను చేశానని చెప్పాడు. అలాగే ఇప్పటి వరకు నేను చేసిన విలన్ పాత్రలను ప్రేక్షకులు క్షమిస్తారేమో గాని... ఇప్పుడు సాక్ష్యంలో చేసిన విలన్ పాత్ర చూస్తే మాత్రం నన్ను క్షమించరు అంటూ... కేవలం డబ్బు ముఖ్యమనే పాత్రలో చేసిన నేను.. ఈ పాత్ర ప్రభావం నా నిజ జీవితం పైన కూడా పడుతుందేమో అని భయపడుతున్నాను అంటూ సాక్ష్యం సినిమాలో తన పాత్ర క్రూరత్వం గురించిన విశేషాలు పంచుకున్నాడు.

Jagapathi Babu about Sakshyam Villain Role:

Jagapathi Babu Sakshyam Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs