Advertisement
Google Ads BL

నాది, అన్నయ్య చిరంజీవిది ఒకే గమ్యం!


నిజానికి పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన నూతన రాజకీయ ఒరవడిని తెస్తారని భావించారు. ఆయనకు సమాజం మీద, ఇందులోని అన్యాయపోకడల మీద బాగా కోపమని, అవినీతి అంటే పడదని, ప్రతి విషయాన్ని రాజకీయం చేసే లక్షణం లేని సరికొత్త రాజకీయాలకు ఆయన అంకుర్పారణ చేస్తారని పలువురు భావించారు. దాంతో నాడు పవన్‌ అభిమానులు కాని వారు కూడా కొందరు మేధావులు, సామాన్యులు పవన్‌ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్‌ మాత్రం ఇప్పటికే మరో సాధారణ నాయకుడిలా మారిపోయినట్లు, అందరిలానే ఆయన ఆరోపణలు ఇతర విషయాలు ఉన్నాయని, ముఖ్యంగా మాట మీద నిలబడే రకం కాదని, స్ధిరస్వభావం లేని వాడని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక పవన్‌ రాజకీయంగా పెద్దగా ఎదగడనే అభిప్రాయానికి కారణం ఆయన మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు కావడం కూడా ఒక కారణం. ప్రతి ఒక్కరు మీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏమి చేశాడు? ఎన్నికల తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే పవన్‌ రాజకీయాలలో పోటీ చేయకుండానే ఇతర పార్టీలకు దాసోహం అంటున్నాడని, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు తాను కూడా సినీ, రాజకీయ రంగంలో చిరు వారసుడినే అని గుర్తుంచుకోవాలని విమర్శలు మొదలయ్యాయి. అలా పవన్‌ మీద ప్రజలకు నమ్మకం కలగకపోవడానికి ఆయన అన్నయ్య చిరు కూడా ఓ కారణమే. 

ఇక తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సదస్సులో పవన్‌ మాట్లాడుతూ, జనసేన ఎవరో పెట్టిన పార్టీ కాదని, అది మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్లో ఒకరు పెట్టిన పార్టీ అని చెప్పాడు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ భిన్నమనస్తత్వాలు ఉంటాయని, అయినా నా గమ్యం, మా అన్నయ్య గమ్యం ఒకటేనని ఆయన తెలిపాడు. ప్రజాసమస్యలను పరిష్కరించే వారు లేకపోవడంతోనే జనసేనను ప్రారంభించాల్సి వచ్చింది. తెలుగు వారందరికీ అండగా నిలిచే పార్టీ జనసేన. ప్రజాకవి గద్దర్‌ నుంచి ప్రతి కళాకారుడు నా మనసుకు దగ్గరైన వారే. కళాకారుడు రాజకీయాలలోకి వస్తే భావోద్వేగాలను అర్ధం చేసుకోగలడు అని తెలిపాడు. అయినా పవన్‌ తన ప్రసంగాలలో చిరంజీవి పేరు ఎత్తకపోవడమే ఆయనకు, ఆయన పార్టీకి మంచిదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. 

Chiranjeevi is my all time favourite : Pawan Kalyan:

Pawan Kalyan meets Chiru fans in Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs