Advertisement
Google Ads BL

చరణ్ మరోసారి... ఎన్టీఆర్ తొలిసారి!!


బాహుబలి సిరీస్ తో ప్రపంచాన్ని చుట్టేసిన దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేశాడు. అయితే రాజమౌళిని అందరూ ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేస్తాడనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టబోతున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాని రాజమౌళి నవంబర్ మొదటి వారంలో పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నాడని... అందుకే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడని టాక్.

Advertisement
CJ Advs

ఇకపోతే రాజమౌళి మళ్ళీ ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడని వినికిడి. బాహుబలితో ఇండియా వైస్ గా మార్కెట్ ని భారీ లెవల్లో క్రియేట్ చేసిన రాజమౌళి తదుపరి చిత్రం విషయంలోనూ ఇండియా ట్రేడ్ వర్గాల్లో అంతే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే బాహుబలి తో బాలీవుడ్ లో కదం తొక్కినట్టుగానే రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ని కూడా బాలీవుడ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు స్టార్ట్ చెయ్యబట్టే.. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి భారీ గ్యాప్ తీసుకున్నాడనేది లేటెస్ట్ సమాచారం. అయితే ఈసారి కూడా కరణ్ జోహార్ నే రాజమౌళి నమ్ముకున్నాడనేది కూడా తాజా సమాచారమే. బాహుబలి సినిమా టైం లో బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ బాహుబలికి ఇచ్చిన చేయూత వలన... అతని ద్వారా జరిగిన ప్రచారం వలనే బాహుబలి బాలీవుడ్ లో విజయకేతనం ఎగరేసింది. అందుకే ఈసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ని కూడా రాజమౌళి కరణ్ జోహార్ చేతికే ఇవ్వబోతున్నాడట.

మాములుగా రాజమౌళి ముందుగా ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ని తెలుగు, తమిళంలోనే విడుదల చెయ్యాలని అనుకున్నట్లుగా... తర్వాత భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. హిందీలోనూ విడుదల చేస్తేనే ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుందని భావించి రాజమౌళి బాలీవుడ్ మీద కన్నేశాడని కూడా మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ తో మళ్ళీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ప్రభాస్ బాహబలితో బాలీవుడ్ లో తిరుగులేని జెండా పాతాడు. ఇక ఇప్పుడు చరణ్ మరోసారి... ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక  RRR పై భారీ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయనేది మాత్రం వాస్తవం.

NTR, Ram Charan RRR in Bollywood:

Rajamouli Bigger Plans With RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs