ఆల్రెడీ డజను మంది హీరోలున్న మెగా కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక కొణిదెల. తొలుత టీవి షోలు, స్పెషల్ ఇంటర్వ్యూల ద్వారా జనాలకు కాస్త అలవాటు చేసి తర్వాత ఆమె అభీష్టం మేరకు అమ్మడిని 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిశ్రమకి పరిచయం చేశారు మెగా ఫ్యామిలీ అండ్ కో. 'ఒక మనసు' ఫస్ట్ లుక్ బయటకొచ్చినప్పట్నుంచి నిహారిక-నాగశౌర్యల నడుమ సూపర్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందని.. అది ఆన్ స్క్రీన్ మాత్రమే కాక ఆఫ్ ది స్క్రీన్ రిలేషన్ కూడా బాగుండడం వల్లనే ఆ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో మెగాఫ్యామిలీ నుంచి, వారి అభిమానుల నుంచి కూడా నాగశౌర్యకి భారీ మద్ధతు లభించడం.. వీరి ప్రేమబంధం కళ్యాణబంధంగా మారుతుందేమోననే ఊహాగానాలు పెల్లుబికాయి.
'ఒక మనసు' షూటింగ్ తర్వాత నీహా-శౌర్య కలిసి ఎక్కడా కనిపించకపోయినా ఇద్దరి గురించి వార్తలు మాత్రం ట్రెండ్ అవుతూనే వచ్చాయి. అయితే.. ఈమధ్యకాలంలో నీహా-శౌర్యల నడుమ గ్యాప్ పెరిగింది. శౌర్యతోపాటు నీహా కూడా సినిమాల్లో బిజీ అయిపోవడంతో వారి నడుమ రిలేషన్ కూడా సన్నగిల్లింది. అందుకే ఇద్దరూ మూవ్ ఆన్ అయిపోయారని వినికిడి. శౌర్య ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు, నీహా కూడా సేమ్ అంతే బిజీగా ఉంటోంది. మరి ఈ విషయం బయటకి వచ్చాక మెగా సపోర్ట్ శౌర్యకి ఉంటుందో లేక ఇక్కడితో స్వస్తి పలుకుతుందో చూడాలి.