Advertisement
Google Ads BL

బాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ టాప్ హీరో!


మన అగ్ర కథానాయకుల్లో ఒక్క బాలకృష్ణ మినహా చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నవారే. అయితే.. ఎవరికీ బాలీవుడ్ పెద్దగా అచ్చిరాలేదు. దాంతో రెండు మూడు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయినవారే అందరూ. వాళ్ళ తర్వాత నవతరం కథానాయకులైన రామ్ చరణ్, రాణాలు బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ సత్ఫలితాలనివ్వలేదు. అందుకే మన తెలుగు సినిమాలు డబ్బింగ్ రూపంలో నార్త్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటున్నప్పటికీ.. మన హీరోలు మాత్రం అక్కడ తమ ఉనికిని చాటుకోలేకపోయారు.

Advertisement
CJ Advs

అయితే.. హీరోలుగా చేస్తే పట్టించుకోవడం లేదు కానీ క్యారెక్టర్ రోల్స్ చేస్తే రిజెక్ట్ చేసే స్థాయిలో మన నటులు లేరు. అందుకే దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగార్జున ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేశాడు. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నాగార్జున ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు అంత సిద్ధమైపోయింది. నాగ్ నేటి నుంచి ముంబైలో జరిగే షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. నాగార్జున రోల్ ఏమిటనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ ముఖ్యపాత్రేనని తెలుస్తోంది. ఇకపోతే.. నాగార్జున-నాని జంటగా తెరకెక్కుతున్న 'దేవదాసు' చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకొంది.  

Nagarjuna returns to Bollywood:

Nagarjuna joins Ranbir Kapoor, Amitabh Bachchan in Brahmastra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs