Advertisement
Google Ads BL

సామ్ పై వచ్చే వార్తలు నిజం కాదు: చైతు!!


డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకోవటమే కాకుండా సక్సెస్ ని కూడా అందుకుంటుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళంలో కూడా ఖాళీ లేకుండా వరస సినిమాలు చేస్తూ జోరును కొనసాగిస్తోంది. అయితే చేతి దాకా వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడంతో ఇంకా ఆమె సినిమాలు ఆపేస్తుంది.. ఆమె ఇంకా ఇంటిపట్టునే వుండాలని నిర్ణయించుకుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఈ వార్తలు గత వారం రోజులు నుండి జోరుగా ప్రచారం జరుగుతుంది. 'రంగస్థలం, అభిమన్యుడు, మహానటి' వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసిన సమంత ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు సామ్ దీనిపై స్పందించలేదు. కానీ తన భర్త నాగ చైతన్య దీనిపై ఎట్టకేలకు స్పందించాడు.

'సమంత సినిమాలు నుండి పూర్తిగా దూరం కానుందనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. సామ్ కి సినిమాలంటే చాలా ఇష్టమని.. అందువలన ఆమె సినీ రంగానికి దూరం కాదని ఆయన చెప్పాడు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు'  అంటూ చైతన్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

Sam Hasn't Quit Films Clarifies Chaitu:

Chaitu Gives Clarity On About Samantha Continue In Film Industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs