Advertisement
Google Ads BL

నా ఇంటికి చేతబడి చేస్తున్నాడు: సీనియర్ నటి!


చేతబడి, బాణామతి వంటి వాటిని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. ఇక మన మేధావులు చెప్పేది ఏమిటంటే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్లనే ఇలాంటి మూడనమ్మకాలను నమ్ముతున్నారనేది వారి వాదన. కానీ ఎంతో విద్య, సాంకేతిక ఉన్న పాశ్చాత్యదేశాలలో కూడా ఆటల పోటీలలో ముందుగా కుడి కాలు గ్రౌండ్‌లో పెట్టాలి.. ఫలానా నెంబర్‌జెర్సీని ధరిస్తేనే బాగా ఆడి గెలుస్తాం... ముందుగా ఏ కాలుకి ప్యాడ్లు కట్టుకోవాలి... ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి మూఢనమ్మకాలనేవి నిరక్షరాస్యత వల్లన కలిగితే అభివృధ్ది చెందిన దేశాలలోని ప్రజల సంగతేంటి? ఇక అమెరిన్లు 13 అనే అంకెను పలకడానికి గానీ, తమ భవనాలను13 అంతస్తుల వరకు కట్టడం గానీ చేయరు. ఇక నాడు ఓ చర్చి ఫాదర్‌ ఫలానా రోజు, ఫలానా తేదీన ఆత్మాహుతి చేసుకుంటే జీసస్‌ని చేరుతామని చెప్పి, మొత్తం 15మందితో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాబట్టి మూఢనమ్మకాల విషయంలో మన మేధావులు చెప్పేది నిజం కాదు. 

Advertisement
CJ Advs

కాని నాటి ఎన్టీఆర్‌కి ఎడమ చేతితోనే ఆశీర్వాదం ఇవ్వమని చెప్పడం, వాటిని ఆయన పాటించడం, ఇక బాలకృష్ణ ముహూర్తం చూసుకోనిదే బయటకు అడుగుపెట్టకపోవడం.. ఎంత పేదవాడి వేషం వేసినా కొన్ని ఆభరణాలను శరీరం నుంచి తీయడానికి ఒప్పుకోకపోవడం, ఫలానా తాయెత్తు మెడలో లేకపోతే బాగా ఆట ఆడలేమనే ఆలోచన, జ్యోతిష్యం, న్యూమరాలజీని సిని నటులందరు పాటిస్తున్నారు. ఇక తాజాగా నాటి హీరోయిన్‌ జయచిత్ర చేసిన ఆరోపణలు పెద్దవారిలో కూడా ఈ మూఢనమ్మకాలు ఎంతగా ప్రబలిపోయాయో తెలియజేస్తోంది. ఆమె మాట్లాడుతూ, చెన్నైలోని తన ఇంటిని హస్తగతం చేసుకునేందుకు ఇలం మురుగన్‌ అనే వ్యక్తి చేతబడి, బాణామతి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.12 ఏళ్లుగా తన ఇంటిలో బాడుగకు ఉంటున్న ఆయన తన ఇంటిని ఖాళీ చేయడం లేదని, కోర్టు ఆదేశాలను సైతం ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించింది. 

మురుగన్‌, మీనా దంపతులు నాకు 7లక్షల దాకా అద్దె బకాయి ఉన్నారని, ఇంటిని ఖాళీ చేయడానికి కోర్టు 20రోజులే గడువు ఇచ్చానా అతను పట్టించుకోవడం లేదని తన ఇంటి చుట్టూ క్షుద్రపూజలు చేస్తూ తన ఇంటిని తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. మురుగన్‌ అనే వ్యక్తి ఓ ఫైనాన్షియర్‌ని మోసం చేసిన కేసులో సెంట్రల్‌ జైలులో ఉన్నాడని, 20వ తేదీన పోలీసుల సాయంతో తన ఇంటిని స్వాధీనం చేసుకుంటానని జయచిత్ర తెలిపింది. అంటే క్షుద్రపూజలు, చేతబడులు, బాణామతిలను ఇంకా జయచిత్ర వంటి వారు నమ్ముతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..!

Actress Jayachitra Complaints on Driver Ilam Murugan:

Man Occupying Actress Jayachithra House now in Jail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs