Advertisement
Google Ads BL

అఖిల్ మూడులో ఐటం సాంగ్ చేస్తోంది ఈ భామే!!


అఖిల్ ముచ్చటగా తన మూడో సినిమాని తొలిప్రేమ తో డీసెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు.  వెంకీ అట్లూరి తొలిప్రేమ వలే... అఖిల్ సినిమాని కూడా డీసెంట్ లవ్ స్టోరీ తోనే తెరకెక్కిస్తున్నాడు. తాజాగా షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖిల్3 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది. సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య తో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ ఇప్పుడు తమ్ముడితో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యింది. మరి మొదటి సినిమా విడుదల కాకముందే ఇలా అఖిల్ సినిమాలో అవకాశం దక్కించుకుని అమ్మా... అనిపించింది నిధి.

Advertisement
CJ Advs

ఇక థమన్ సంగీతం అందిస్తున్న  ఈసినిమాలో రొమాంటిక్ సాంగ్స్ తో పాటుగా... ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా వుండబోతుందట. ఈ సినిమాలో అందరిని మరిపించేలా ఒక ఐటెం సాంగ్ ని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నాడని... అందునా ఒక అదిరిపోయే ఐటెం గర్ల్ కోసం వేటాడుతున్నారని... చెబుతున్నారు. అయితే తిక్క, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాల్లో ఐటమ్స్ లో అదరగొట్టిన ఫరా కరిమి ని అఖిల్3 కోసం ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఫీల్ గుడ్ ప్రేమ కథలో అదిరిపోయే ఐటెం సాంగ్ ని కూడా జోడిస్తే... ఇంకా బావుంటుందని థమన్ తో పాటుగా వెంకీ అట్లూరి భావిస్తున్నాడని... అందుకే ఈ సినిమాలో ఐటెం ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. 

ప్రస్తుతం అఖిల్ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఫైనల్ గా అదే టైటిల్ ని ఉంచుతారా.. లేదా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతానికి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

Farah Karimi item song in Akhil, Venky Atluri film:

Akhil Gunning Balakrishna’s Beauty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs