చికాగో సెక్స్‌ రాకెట్‌పై రెజీనా ఏమందంటే..?


తెలుగులో అందం, అభినయం, గ్లామర్‌షో, లిప్‌కిస్‌లు కూడా చేయగలిగిన నటి రెజీనా. ఈమె కెరీర్‌ కూడా దాదాపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తోనే ప్రారంభమైనా ఆమె స్టార్‌ హీరోయిన్‌గా మారింది. కానీ రెజీనా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఇక ఇటీవల అమెరికాలో నివసిస్తున్నతెలుగువారైన కిషన్‌ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళా పూర్ణిమ మోదుగుమూడిలను అమెరికన్‌ ఫెడరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశాడు. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో తెలుగు సెలబ్రిటీలైన నటీనటులు, యాంకర్లను అమెరికా రప్పించి వారిచేత వ్యభిచారం చేయిస్తున్నట్లు అమెరికన్‌ పోలీసులు నిర్దారించారు. ఇదే క్రమంలో పదుల సంఖ్యలో నటీమణులను విచారణ చేస్తున్నారు. ఈ సెక్స్‌రాకెట్‌ విషయంలో ఎందువల్లో తెలియదు గానీ పలువురు ఇస్తున్న క్లూల ఆధారంగా రెజీనా కూడా ఆ సెక్స్‌రాకెట్‌లో భాగస్వామి అయినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

దీనిపై ఇప్పటి వరకు నోరువిప్పని రెజీనా తాజాగా ఈ విషయంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ, నా ప్రమేయం లేకుండానే నాపై రూమర్లు వస్తున్నాయి. ప్రతి దానికి స్పందించి, ప్రతి వార్తలను ఖండిస్తూ కూర్చుంటే మరింతగా టార్గెట్‌ అవుతామని, మరింతగా నన్ను కార్నర్‌ చేస్తారని నాకు తెలుసు. అందుకే ఇంతకాలం ఈ విషయంపై స్పందించలేదు. ఎవరైనా వ్యక్తులు ఏదైనా విషయం మీద, లేదా ఎవరిమీదనైనా తప్పుగా మాట్లాడుకునేటప్పుడు నిజాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. 

నాకు ఏమాత్రంసంబంధం లేని విషయంలో నన్ను ఇరికించడం బాధగా ఉంది. అవసరం అనిపిస్తే అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇస్తాను... అంటూ తన ఆవేదనను, ఉద్వేగాన్నివెలిబుచ్చింది. మరి ఇప్పటికైనా ఆమె పేరు వార్తల్లోకి రాకుండా ఫుల్‌స్టాప్‌ పడుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!

Regina Cassandra responds on Tollywood Chicago Sex Racket:

Regina Reacts on Chicago Sex Racket
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES