Advertisement
Google Ads BL

బాబుగోగినేని మరోసారి దొరికాడు..!


ఏమైనా జరగవచ్చు అంటూ ముందుకు సాగుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌2 ఆసక్తికరంగా సాగుతోంది. నేచురల్‌ స్టార్‌ నాని రోజురోజుకి బాగా రాటుదేలుతున్నాడు. తాజాగా ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో తనని తాను బిగ్‌బాస్‌గా భావించే బాబు గోగినేని నిజస్వరూపాన్ని బహిర్గతం చేశాడు. ప్రముఖ హేతువాది అయిన బాబుగోగినేని తన వాదనల ద్వారా ప్రత్యర్ధులను తన మాటల ప్రభావంలో పడేస్తాడు. అటువంటి ఆయన తేజస్వి మాటలు విని.. ప్రభావితుడై దీప్తిని ఎలిమినేషన్‌కి ఎంపిక చేశాడని నాని కుండబద్దలుకొట్టడంతో బాబు గోగినేని అడ్డంగా బుక్కయ్యాడు. 

Advertisement
CJ Advs

హౌస్‌లోని ఓ వ్యక్తి మాటలు విని మరొకరిని హౌస్‌లోంచి బయటకు పంపాలని ఎలా అనుకుంటారని నాని ప్రశ్నించాడు. దీంతో టాపిక్‌ని డైవర్ట్‌ చేయలేక బాబుగోగినేని నానా ఇబ్బందులు పడ్డాడు. అంతటితో బాబుని నాని వదలలేదు. కెప్టెన్‌ కౌశల్‌ గురించి తేజస్వి, భానులతో కలిసి బాబుగోగినేని వేసిన జోక్‌లకు సంబంధించిన వీడియోని చూపిస్తూ నాని అందరినీ నిర్ఘాంతపరిచాడు. బయటకు కౌశల్‌తో సన్నిహితంగా ఉంటూనే, అతను లేనప్పుడు అతని గురించి తప్పుగా మాట్లాడుతున్న వీడియోను నాని చూపించడంతో బాబుగోగినేనితో సహా అందరు నిర్ఘాంతపోయారు. 

ఇక తేజస్వికి కూడా నాని బాగా క్లాస్‌ తీసుకున్నాడు. ఆమె మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదని, చాలా మార్పు వచ్చిందని, తాను ఇబ్బంది పడటమే కాకుండా తన చుట్టు ఉన్నవారిని కూడా తప్పుడు మాటలతో ప్రభావితం చేస్తోందని నాని తెలిపాడు. ముఖ్యంగా కౌశల్‌ విషయంలో ఏదో మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తోందని, ఇది మంచిది కాదని హితవు చెప్పాడు. ఇక హౌస్‌లో ఉన్న కామన్‌మెన్‌ గణేష్‌ని ఎంకరేజ్‌ చేస్తూ నాని మాట్లాడాడు. ప్రతి సారి గత నాలుగు వారాలుగా అందరు కలిసి గణేష్‌ని ఎలిమినేట్‌ చేయాలని భావిస్తున్నారని, పైకి మాత్రం అమాయకంగా నటిస్తున్నారని తెలిపాడు. ఇక ప్రేక్షకులు కూడా హౌస్‌లో ఉన్న ఒకే ఒక్క కామన్‌మేన్‌ గణేష్‌ని తమ ఓట్ల ద్వారా పోటీలో నిలిచేలా చేస్తున్నారు.

Nani Counter to Babu Gogineni :

Babu Gogineni Real Character Revealed by Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs