Advertisement
Google Ads BL

'అరవిందసమేత' మరో అప్డేట్..!!


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన నటించిన 'టెంపర్‌, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్‌, జైలవకుశ' వంటి చిత్రాలు విజయబావుటా ఎగురవేశాయి. ముఖ్యంగా 'జైలవకుశ' వంటి యావరేజ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాన్ని కూడా ఆయన ఒంటిచేత్తో అందునా కేవలం జై పాత్ర ద్వారా విజయతీరాలకు చేర్చాడు. ఇక ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రంలో నటిస్తున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో 'డీజే' భామ పూజాహెగ్డే, ఈషారెబ్బా నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

త్రివిక్రమ్‌కి సొంత బేనర్‌ వంటి హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ రాయలసీమ కుర్రాడిగా రఫ్‌ పాత్రతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఓ సాఫ్ట్‌ కార్నర్‌ పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఒకే పాత్రలోని రెండు డైమెన్షన్‌గా ఇవి ఉండనున్నాయి. ఆమద్య ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మూడు స్టిల్స్‌ని విడుదల చేశారు. ఇందులో ఈ రెండు విభిన్న షేడ్స్‌ని చూపించారు. మరోవైపు ఈచిత్రం షూటింగ్‌ ప్రస్తుతం 60శాతం వరకు పూర్తయినట్లుగా తెలుస్తుంది. 

ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేసిన అనంతరం ఎన్టీఆర్‌ రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడు. 'అజ్ఞాతవాసి' ద్వారా తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎదుర్కొనన్ని విమర్శలను ఎదుర్కొన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి ఇది అగ్నిపరీక్ష. మరోవైపు 'అజ్ఞాతవాసి' నష్టాలను ఈ చిత్రం ద్వారా పూడ్చుకోవాలని నిర్మాత రాధాకృష్ణ అలియాస్‌ చిన్నబాబు భావిస్తున్నారు.మరి వీరి ఆశలు ఫలిస్తాయో లేదో వేచిచూడాలి! 

Aravinda Sametha Teaser Release Date Locked :

Aravinda Sametha Teaser Release on Independence Day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs