Advertisement
Google Ads BL

'యాత్ర': అదే దరహాసం, అదే అభివాదం!


మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అంటే ఆయన పాత్ర కోసం దేనికైనా తెగిస్తారు. నటించడం కాదు జీవిస్తాడు. ఈ విషయంలో ఆయన తెలుగులో నటించిన కె.విశ్వనాథ్‌ చిత్రం 'స్వాతికిరణం'తోనే అర్ధమైంది. ఓ ముస్లిం అందునా మలయాళీ అయి ఉండి సంగీత ప్రధాన చిత్రంలో అందునా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఈయన నటించిన ఈ చిత్రంలో తన పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పుకోవడం గొప్ప సాహసం. మరలా ఇంతకాలానికి మమ్ముట్టి మరోసారి అదిరిపోయే పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

Advertisement
CJ Advs

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మహాప్రస్దానమైన పాదయాత్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'యాత్ర' చిత్రంలో వైఎస్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఆనందోబ్రహ్మ' దర్శకుడు మహి.వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో తన పాదయాత్ర గురించి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడే మాటలతో ప్రారంభమంది. 'తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలని ఉంది. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది..' అనే డైలాగ్స్‌ ఈ టీజర్ లో వున్నాయి. 

ఇక వైఎస్‌ తరహాలోనే మమ్ముట్టి కూడా వైయస్‌ఆర్‌.. వైయస్సార్‌ అనేనినాదాల మద్య ఎడమచేయి పైకెత్తి అభివాదం చేస్తూ ఉన్నాడు. పంచెకట్టులో రాజన్నని తలపిస్తూ, అదే దరహాసం, అదే అభివాదంతో మమ్ముట్టి మ్యాజిక్‌ చేశాడు. ఇక ఈ టీజర్‌కి నేపధ్యసంగీతం మరో ఆకర్షణగా నిలిచింది. ఈటీజర్‌ని చూస్తేనే దీనికోసం యూనిట్‌ పడిన కష్టం అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్‌ ఇప్పటికే లక్షల్లో దూసుకెళ్లుతోంది..! 

Click Here For Teaser

Yatra Teaser Released:

Yatra Teaser Released on the Occasion of YSR Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs