సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత అందులో మంచి విషయాల కన్నా.. ఎక్కువగా చెడు విషయాలే స్ప్రెడ్ అవుతున్నాయి. యువత కూడా మంచి విషయాల కన్నా ఎక్కువగా చెడు విషయాలకే కనెక్ట్ అవుతున్నారు కూడా. ఇక రూమార్స్ అయినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఏవిధంగా అంటే... నిన్నటికి నిన్న అరవింద సమేత షూటింగ్ స్పాట్ లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఎన్టీఆర్ కి మధ్య ఈగో వల్ల విభేదాలంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాని కమ్ముకున్నాయి. అందరూ ఆ రూమర్ నిజమనుకునే లోపు ఎన్టీఆర్ తో శ్రీనివాస్ రెడ్డితో త్రివిక్రమ్ ఒక సెల్ఫీ దిగి ఆ రూమర్స్ కి చెక్ పెట్టించాడు. మరలా రూమర్స్ కి చెక్ పెట్టకపోతే.. అవే నిజమని నమ్మి అందరు ఎన్టీఆర్ కి శ్రీనివాస్ రెడ్డికి మధ్య గొడలవని ఫిక్స్ అయ్యేవారు.
ఇక తాజాగా అనుపమకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య విభేదాలంటూ.. కొన్ని న్యూస్ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది కూడా వీరిద్దరూ తాజాగా నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమే షూటింగ్ స్పాట్ లో అనుపమకు ప్రకాష్ రాజ్ కి మధ్య విభేదాలంటూ కొన్ని న్యూస్ లు హల్చల్ చేశాయి. వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని.. ఇంతలో ప్రకాష్ రాజ్ కోపంతో...అనుపమ మీద గట్టిగా అరవడంతో.. అనుపమ ఏడ్చేసిందని.. ఇలా రకరకాల న్యూస్ లు వైరల్ అయ్యాయి. అయితే అలా ఆ న్యూస్ సోషల్ మీడియా అంతటా వ్యాపించడంతో... అలెర్ట్ అయిన అనుపమ వెంటనే ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది.
అదెలా అంటే ఒకే ఒక్క సెల్ఫీ.. అంటే ప్రకాష్ రాజ్, తాను నవ్వుతూ ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ తో తీసుకున్న సెల్ఫీ ఒకదాన్ని పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటో తోపాటుగా అన్ని జోక్స్ అంటూ కామెంట్ పెట్టింది. ఇంకేముంది అనుపమకు ప్రకాష్ రాజ్ కి మధ్య గొడవేం లేదని తేలిపోయింది. లేదంటే నిజమేనేమో అనుపమని ప్రకాష్ రాజ్ తిట్టేడేమో అంటూ బోలెడన్ని మసాలాలు దట్టించి మరీ మీడియాలో స్ప్రెడ్ చేసే వారు గాసిప్ రాయుళ్లు.