Advertisement
Google Ads BL

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈవిడే..!


తెలుగులో గత నెలరోజుల నుండి రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు... అందరిళ్ళల్లలో బిగ్ బాస్ సీజన్ 2 అంటూ రియాలిటీ షో ని బుల్లితెర మీద వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. శని ఆది వారాల్లో నాని వ్యాఖ్యానంతో సీరియస్ మోడ్ నుండి కామెడీ మోడ్ ఇలా రకరకాల వేరియేషన్స్ తో ఉన్న ఈ షో మిగతా వారం మధ్యలో షోలో కంటెస్టెంట్స్ చేసే హడావిడి తో ఈ బిగ్ బాస్ సీజన్ 2 కూడా బాగానే ప్రేక్షకాదరణ పొందింది. నాని కూడా చాలా చక్కగా బిగ్ బాస్ సీజన్ 2 ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక ఈ షో మొదలైన మూడు వారాల్లో మొదటగా సంజన ఈ షో నుండి ఎలిమినేట్ అవ్వగా.. నెక్స్ట్ ఎలిమినేటర్ కామన్ మ్యాన్ నూతన నాయుడు బయటకెళ్ళాడు. ఇక మూడో వారం నటుడు కిరీటి ఎలిమినేట్ అయ్యాడు. ఇక తాజాగా నాలుగో వారం ఎలిమినేటర్ మీద అందరిలో ఆసక్తి మొదలైంది

Advertisement
CJ Advs

ఈ వారం ఎలిమినేషన్స్ లో గీతా మాధురి, తేజస్వి, గణేష్, కౌశల్, శ్యామల, దీప్తి, బాబు గోగినేని, నందిని ఉన్నారు. మరి వారిలో గత రాత్రి గీత, గణేష్ సేఫ్ జోన్ లోకొచ్చేసారు. ఇక ,మిగతా ఆరుగురిలో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అనేది ఈ రోజు రాత్రి నాని 10 గంటలకు చెబుతాడు. అయితే ఈ షో రికార్డెడ్ అని లైవ్ కాదనేది అందరికి తెలిసిందే. నిన్న జరిగింది ఈ రోజు ప్లే చేసే ఈ షో కి సంబందించిన సీక్రెట్ ఒకటి ఇప్పుడు బయటికొచ్చేసింది. అది కూడా బయటి కొచ్చిన వాళ్ళు కామ్ గా తమ పని తాము చేసుకోవాలి గాని ఇలా షో ప్రసారం కాకముందే బిగ్ బాస్ సీక్రెట్స్ బయటికి చెప్పేస్తే మాత్రం రూల్స్ అతిక్రమించినట్టే. అందుకే ఇప్పుడు స్టార్ మా కి తలనొప్పి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే సంజన, నూతన నాయుడు వలన బిగ్ బాస్ కి కాస్త డ్యామేజ్ అయింది. మళ్ళా ఇప్పుడు మరో తలనొప్పి.

నాలుగో కంటెస్టెంట్ గా ఈ వారం షో నుండి ఎలిమినేట్ అయింది ఎవరో తెలిసిపోయింది. ఆమె ఎవరో కాదు యాంకర్ శ్యామల ఈ వారం ఎలిమినేట్ అయింది. ఈ విషయం ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారా? అదేనండి ఒక రోజు ముందే బిగ్ బాస్ రికార్డ్ చెయ్యడంతో ఇప్పటికే బయటికి వచ్చిన శ్యామల తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని.... తాను బిగ్ బాస్ హౌస్ ను వీడి వచ్చానని చెబుతూ... తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్ట్ లో ప్రస్తుతం తన కొడుకు ఇషాన్ తో ఆడుకుంటున్నానని శ్యామల చెప్పెయ్యడంతో.. బిగ్ బాస్ ఎంతో హైప్ క్రియేట్ చేయాలనుకున్న ఆ నాలుగో ఎలిమినేటర్ ఇలా సీక్రెట్ విప్పెయ్యడంతో.. ఇప్పుడు స్టార్ మా కి కోపం వచ్చేసింది. మరి ఏ విషయమైనా లీక్ చెయ్యకుండా ఉండాలనే రూల్ ని ఇలా శ్యామల బ్రేక్ చెయ్యడం స్టార్ మా కి మింగుడు పడడం లేదు. అయితే స్టార్ మా ఆగ్రహానికి గురైన శ్యామల వెంటనే తన పోస్ట్ ని డిలేట్ చేసినప్పటికీ... అప్పటికే సోషల్ మీడియాలో శ్యామల పోస్ట్ వైరల్ అయ్యింది.

Bigg Boss Big Secret leaked:

Shyamala Leaked Bigg Boss Big Secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs