తెలుగులో శ్రీదేవి, జయసుధ వంటి వారు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే హీరోయిన్‌గా దేశ, విదేశాలలో, బాలీవుడ్‌లో కూడా విజయకేతనం ఎగురవేసిన నటి జయప్రద. సత్యజిత్‌రే వంటి దర్శకుడు జయప్రదని మించిన అందగత్తెను తాను చూడలేదని కితాబునిచ్చాడు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈమె శ్రీదేవికి విపరీతమైన పోటీ ఇచ్చింది.
ఆమె తాజాగా కాస్టింగకౌచ్ గురించి స్పందిస్తూ, మా కాలంలో మీ అమ్మాయిని సినిమాలలోకి పంపిస్తారా? అంటే 'నో' అని చెప్పి, మాకు ఆ ఖర్మలేదనే వారు. కానీ నేడు తల్లిదండ్రులే తమ పిల్లలకు సినిమాలలో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తున్నారు.నేను స్కూల్‌లో చదివే రోజుల నుంచి నటిస్తున్నాను. నా మొదటి చిత్రాలన్నీ అద్భుతంగా ఆడాయి. దాంతో నేనెవరినీ అవకాశాలు అడగాల్సిన అవసరం రాలేదు.
దాంతో నాకు కాస్టింగ్‌కౌచ్ ఎదురుకాలేదు కానీ నేడు ముంబై నుంచి ఎందరో వస్తున్నారు. అందరు టాప్ హీరోయిన్లు కావాలని ఆశపడుతున్నారు. దాంతో ఈ కాస్టింగ్‌కౌచ్ పుడుతుంది. రాజకీయాలలో, సినిమాలలోనే గాక అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ కాస్టింగ్‌కౌచ్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది.