Advertisement
Google Ads BL

రేణు దేశాయ్ ఆవేశంలో అర్ధం వుంది..!


పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ త్వరలో రెండో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేణుదేశాయ్‌ పేరుతో పవన్‌కి వ్యతిరేకంగా ఓ మెసేజ్‌ సర్క్యులేట్‌ అవుతోంది. దీనిపై రేణు స్పందించింది. ఓ స్టుపిడ్‌ పొలిటికల్‌ పర్సన్‌ ఈ మెసేజ్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నాడని మండిపడింది. దీనిపై కొందరు సభ్యత లేకుండా, మరికొందరు భయపెడుతూ కామెంట్స్‌ పెడుతున్నారని ఆమె వాపోయింది. కొందరైతే ఆ మాటలు తప్పు అని చెప్పాలని బలవంతం చేస్తున్నారని గత ఐదేళ్లుగా నేను ఏ తప్పు చేయకుండానే పలు నిందలు భరిస్తూ వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement
CJ Advs

ఈ కాలంలో తన ఆత్మాభిమానం గురించి ఎవరైనా ఆలోచించారా? అని ఆమె సూటిగా ప్రశ్నించింది. అన్నిమర్చిపోయి సైలెంట్‌గా ఉండాలంటూ తనకి ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆ విధంగా భయపెట్టి నన్ను మౌనంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపింది. నా ఆత్మాభిమానం కోసం ఏదైనా మాట్లాడితే. మౌనంగా భరించు అంతేగానీ ఏమి మాట్లాడవద్దు అని నాకు సలహాలు, బెదిరింపులు చేస్తున్నారు. ఫ్రీపబ్లిసిటీ కోసం నేను ఏవేవో మాట్లాడుతున్నానని అంటున్నారని, ఇది నాకు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తోంది. 

పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌కి భంగం వాటిల్లితే నేను వచ్చి సరిచేయాలా? ఇలాంటి సమాజంలో జీవిస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఏదో ఒకరోజు నాకు మనశ్శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. పవన్‌ గురించి నేను బహిరంగంగా ఏమీ మాట్లాడనని రేణుదేశాయ్‌ తేల్చిచెప్పింది.

Renu Desai Slams Pawan Kalyan Fans:

Renu Desai takes an important decision after Engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs