ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో ఒకటి గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన 'పంతం' మూవీ. మరొకటి సాయి ధరమ్ తేజ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'తేజ్ ఐ లవ్ యు'. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో విడుదలయ్యాయి.అయితే అందులో గోపీచంద్ 'పంతం', సాయి ధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాలు రెండింటికి...యావరేజ్ టాక్ రావడం అలాగే రెండు సినిమాలకు క్రిటిక్స్ కూడా ఒకేలాంటి మార్కులు వేయడం జరిగాయి. గురువారం విడుదలైన పంతం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది.
గోపీచంద్ కి మరో ప్లాప్ పడింది అనుకున్నా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. మరి సాయి ధరమ్ తేజ్ ఐ లవ్ యూ కి అంత కలెక్షన్స్ వచ్చే సీన్ లేదంటున్నారు. సాయి ధరమ్ సినిమాలో అనేక మైనస్ లు ఉన్నాయంటున్నారు. కేవలం అనుపమ ఎక్సప్రెషన్స్, సినిమాటోగ్రఫీ తప్ప ఆ సినిమాలో మరే ప్లస్ పాయింట్ లేదంటున్నారు. ఇక గోపీచంద్ పంతం మూవీ లో మైనస్ లు ఉన్న తేజ్ ఐ లవ్ యూ కన్నా బెటర్ అనేలా ఉన్నాయని...అందుకే ఈ వారంలో గోపీచంద్ గట్టెక్కేసినట్లే అంటున్నారు.
ఇక కరుణాకరన్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోవడం... రొటీన్ కథతో తేజ్ ఐ లవ్ యూ ని బోర్ కొట్టించేసాడంటున్నారు. ఏదిఏమైనా ఈ వారం విజేత మాత్రం గోపీచందే. అసలే కష్టాల్లో ఉన్న గోపీచంద్ కి తాజాగా వచ్చిన తేజ్ ఐ లవ్ యు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం కలిసొచ్చినట్లే. ఇలా గోపీచంద్ అనుకోకుండా సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు.