Advertisement
Google Ads BL

పవన్‌.. ఈ ఫోటో ఇప్పుడెందుకు?


సినిమా వారికి సంబంధించిన ఏ విషయమైనా ఎక్కువగా వీక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వారికి సంబంధించిన చిన్న విషయమైనా అది వైరల్‌ అవుతుంది. ఈ విషయంలో సినీ సెలబ్రిటీల కంటే రాజకీయ నాయకులు కూడా దిగదుడుపే. అందునా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా అది మెగాస్టార్‌, పవర్ స్టార్ విషయాలలో అందరి చూపు వారిపై పీక్స్‌లో ఉంటుంది. వారు ఏది చెప్పినా, ఏది పోస్ట్‌ చేసినా క్షణాలలో వైరల్‌ అవుతుంటుంది. అందునా పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు స్టార్‌ కమ్‌ పొలిటీషియన్‌ కూడా. దాంతో తాజాగా ఆయన పోస్ట్‌ చేసిన ఓ ఫోటో కేవలం మెగాభిమానులనే కాదు... సినీ ప్రేమికులందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. 

Advertisement
CJ Advs

తాజాగా పవన్‌ తాను ఏడో తరగతి చదివేటప్పుడు తన సోదరులైన చిరంజీవి, నాగబాబుతో పాటు తన సోదరీమణితో కలిసి తీయించుకున్న ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటో తీసుకున్న కాలంలో తాను ఏడో తరగతి చదువుతున్నానని, తాను అప్పుడే శ్వాసకోశ సంబంధ వ్యాధి నుంచి బయటపడ్డానని పవన్‌ తెలిపాడు. నిజానికి మెగాస్టార్‌ చిరంజీవి, మెగాబ్రదర్‌ నాగబాబుల మధ్య వయసు వ్యత్యాసం పెద్దగా ఎక్కువగా ఉండదు. కానీ అదే పవన్‌ విషయానికి వస్తే వారి మధ్య వయసు వ్యత్యాసం బాగా ఉంటుందని ఈ ఫొటో మరోసారి నిరూపించింది. 

ఇక దీనిని బట్టి పవన్‌ తన చిన్నవయసులో శ్వాససంబంధమైన వ్యాధితో బాధపడే వాడనే విషయం కూడా ఆయన ద్వారానే బయటకి వచ్చింది. జనసేనాధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటోను పలువురు పదిలంగా దాచుకుంటూ తమ స్నేహితులతో పాటు అందరికి పంపుతుండటంతో ఇది బాగా వైరల్‌ అయింది. ఈ ఫొటోని చూస్తే ఈ సమయానికే చిరంజీవి నటునిగా పరిచయం అయ్యాడనే అనిపిస్తోంది. మరి ఇది నెల్లూరులో పవన్‌కళ్యాణ్‌ చదువుకుంటున్నరోజుల్లో తీసుకున్న ఫోటోనా? మరి ఇంకెప్పుడు తీసుకున్నారు? అనే విషయాలను మాత్రం పవన్‌ తెలియజేయలేదు. 

Pawan Kalyan Posts Childhood Pic:

Pawan Shares Rarest of the Rare Pic &nbsp; <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs