Advertisement
Google Ads BL

ఏంటి సమంతా.. ఇది నిజమేనా?


చైతు 'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సమంత.. ఆ తర్వాత వరసబెట్టి సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుండి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సామ్.. చైతుని లవ్ చేసి పెళ్లి చేసుకుని సక్సెస్ అయింది. అక్కినేని కోడలుగా పిలుచుకునే సామ్.. మ్యారేజ్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

తర్వాత ఆమె అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చి సినిమాలు ఒప్పుకోవడం స్టార్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు సామ్ సినిమాలకు గుడ్ బాయ్ చెపుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కమిటైన సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత గ్లామర్ ఇండస్ర్టీకి దూరంగా వుండాలన్నది ఆమె ప్లాన్‌గా చెబుతున్నారు.

పెళ్ళికి ముందుకన్నా పెళ్లి తర్వాత చేసిన 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబుథరై' వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. దాంతో సమంత ఇంకా కంటిన్యూ అవుతుందని ఆమె అభిమానులు భావించారు. కానీ సడెన్ గా ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలియలేదు. ప్రస్తుతం సామ్...తెలుగు, తమిళం ఒక్కో ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ రెండూ మార్చి నాటికి పూర్తికానున్నాయి. సమంత గ్లామర్ ఇండస్ర్టీ నుంచి తప్పుకుంటోందని వార్తల నేపథ్యంలో అక్కినేని అభిమానులు లైన్‌లోకి వచ్చేశారు. దాంతో మీడియాలో రకరకాలు కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని ఇంటికి వారసుడు రాబోతున్నాడని.. అక్కినేని ఫామిలీ సామ్ ను సినిమాలు ఆపేయాలని...ఇలా చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సామ్ నోరు విప్పాల్సిందే.

Samantha to quit films from next year:

Shocker: Samantha To Quit Films  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs