Advertisement
Google Ads BL

ఈ సెల్ఫీకి అంత విశేషం ఉందన్నమాట..!


ఇద్దరూ ఇద్దరే. ఒకరు భారతీయ సినీ రంగంలో కింగ్‌ఖాన్‌గా పేరు ప్రఖ్యాతులు గడిస్తే మరొకరు భారతీయులంతా ఒకే మతంలా భావించే క్రికెట్‌ దేవునిగా పేరు తెచ్చుకుని మాస్టర్‌ బ్లాస్టర్‌గా కీర్తి గడించాడు. అలాంటి ఆ ఇద్దరు ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. వారే ఎస్‌ఆర్‌కే.. అంటే షారుఖ్‌ఖాన్‌ కాగా మరొకరు ఎస్‌ఆర్‌టి అంటే సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. ఇక విషయానికి వస్తే ఇటీవల దేశవిదేశాలలో వ్యాపారవేత్తగా, భారత్‌ అంటే అంబానీ, అంబానీ అంటే భారత్‌గా పేరు తెచ్చుకున్న ముఖేష్‌ అంబానీ తనయుడు ఆకాష్‌ అంబానీ నిశ్చితార్థ వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ఈ నిశ్చితార్ధం పూల కోసమే విదేశాలలో 25కోట్లు వెచ్చించి పూలను దిగుమతి చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపారదిగ్గజాలు ఎందరో హాజరయ్యారు. ఈవేడుకలో భాగంగా షారుఖ్‌ఖాన్‌తో కలిసి సచిన్‌ టెండూల్కర్‌ మరాఠీ వెడ్డింగ్‌ క్యాప్స్‌ పెట్టుకుని సరదాగా సెల్ఫీ దిగారు. 

Advertisement
CJ Advs

దీనిని సచిన్‌ ట్వీట్‌ చేస్తూ 'జబ్‌ ఎస్‌ఆర్‌కే మెట్‌ ఎస్‌ఆర్‌టి అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చాడు. సచిన్‌ చేసిన ట్వీట్‌కి షారుఖ్‌ కూడా స్పందించాడు. మేము సాధారణంగా దిగే ఫొటోలను ఆల్బమ్స్‌లో పెట్టుకోం. కానీ ఓ గొప్ప వ్యక్తితో దిగిన ఫొటో అయిన దీనిని మాత్రం జీవితాంతం దాచుకుంటానని తెలిపాడు. మరోవైపు కొంతకాలం కిందట తామే దిగిన మరో ఫొటోను దానికి జతపరుస్తూ.. 'అప్పుడు.. ఇప్పుడు' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

ఇక ముఖేష్‌ అంబానీ ఐపీఎల్‌లో తన సొంత టీమ్‌ అయిన ముంబై ఇండియన్స్‌కి సచిన్‌ మెంటర్‌గా వ్యవహరిస్తుండగా, షారుఖ్‌ఖాన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీంకి అధిపతిగా ఉన్నాడు. మరోవైపు షారుఖ్‌ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వంలో మరుగుజ్జుగా నటిస్తున్న 'జీరో' చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఇందులో విరాట్‌కోహ్లి భార్య అనుష్కశర్మ కూడా నటిస్తోంది. మరోవైపు సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం భారత్‌ అండర్‌ 19 జట్టుకు ఎంపిక అయ్యాడు. దీంతో ఈ ఇద్దరి అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. షారుఖ్‌ అభిమానులు 'జీరో' కోసం ఎదురుచూస్తుండగా, సచిన్‌ అభిమానులు అర్జున్‌ టెండూల్కర్‌ ఇండియా జట్టులోకి ఎప్పుడు వస్తాడో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Sachin Shares Selfie with SRK, Says Jab SRK met SRT:

SRK’s reply on Sachin Tendulkar’s selfie with him will melt your hearts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs